ఆదివారం 25 అక్టోబర్ 2020
Mancherial - Jun 27, 2020 , 02:23:10

గనుల ప్రైవేటీకరణపై ఆగ్రహం

గనుల ప్రైవేటీకరణపై ఆగ్రహం

  • n టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో కార్మికుల  నిరసనలు
  • n కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం

మందమర్రి రూరల్‌ : కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులను ప్రైవేటీకరించడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వ వైఖరిపై టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసనలు వ్యక్తం చేశారు. ఏరియాలోని అన్ని గనులు, డిపార్టుమెంట్లపై కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశా రు. ఈ సందర్భంగా  టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్‌ మాట్లాడారు. బొగ్గు బ్లాకులను ప్రైవేట్‌ సంస్థలకు వేలం వేయడం సరికాదన్నారు. కార్మికులంతా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించాలన్నారు. ఈ సందర్భంగా ఏరియాలోని కేకే 5, కేకే 1, ఓసీపీ, అన్ని డిపార్టుమెంట్ల వద్ద కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. కార్యక్రమంలో నాయకులు బడికెల సంపత్‌కుమార్‌, ఓ రాజశేఖర్‌, శంకర్‌రావు, అన్ని గనుల పిట్‌ కార్యదర్శులు, కార్మికులు పాల్గొన్నారు. 

రామకృష్ణాపూర్‌ :  టీబీజీకేఎస్‌ గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపు మేరకు గనులపై కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆర్కే1ఏ గనిపై  నిర్వహించిన గేట్‌ మీటింగ్‌లో టీబీజీకేఎస్‌ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి మాట్లాడారు. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణతో సింగరేణితో పాటు  కోలిండియాకు కూడా నష్టమేనని తెలిపారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జూలై 2న టీబీజీకేఎస్‌ అధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన సమ్మెను కార్మికులు విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు బడికెల సంపత్‌కుమార్‌, ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్‌, జీఎం చర్చల ప్రతినిధి కల్కూరి సత్యనారాయణరెడ్డి, పిట్‌ కార్యదర్శి టీ మల్లేశ్‌ పాల్గొన్నారు.ఆర్కేపీ ఓసీపీ, సీహెచ్‌పీలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు.కార్యక్రమాల్లో పిట్‌ కార్యదర్శులు రాజ్‌కుమార్‌, జే శ్రీనివాస్‌, మిట్ట పోషం, రమణ, శంకర్‌రావు, సామల రాజమౌళి, కోల చంద్రమోహన్‌, కార్మికులు పాల్గొన్నారు.

జైపూర్‌: శ్రీరాంపూర్‌ డివిజన్‌ ఇందారంఖని 1ఏ గనిపై కార్మికులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. జైపూర్‌ విద్యుత్‌ కేంద్రంలో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అనంతరం యాజమాన్యానికి వినతిపత్రం ఇచ్చా రు. కార్యక్రమాల్లో ఇందారంఖని 1ఏగని బ్రాంచ్‌ సెక్రటరీ పానుగంటి సత్తయ్య, పిట్‌ కార్యదర్శి మల్లన్న, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి జనార్దన్‌ రెడ్డి, నాయకులు ఎల్లయ్య, లెక్కల విజయ్‌, రాంచందర్‌, శ్రీనివాస్‌, ఆశాలు, చుక్కల శ్రీనివాస్‌,  ఉద్యోగులు పాల్గొన్నారు. 

బెల్లంపల్లి టౌన్‌ :  మందమర్రి ఏరియా శాంతిఖని గని షాఫ్ట్‌ వద్ద టీబీజీకేఎస్‌ నాయకులు కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గని పిట్‌ కార్యదర్శి దాసరి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏరియా నాయకులు సీహెచ్‌.వెంకటరమణ, కమిటీ సభ్యులు కొట్టె రమేశ్‌, ప్రేమ్‌కుమార్‌, గంటల అంజయ్య, పెద్దపల్లి రాజయ్య, సూరం మల్లేశ్‌, దాడి రమేశ్‌, శ్రీనివాసచారి, మీస అంజయ్య, లింగాల రాజేశం పాల్గొన్నారు. ఎక్స్‌ప్లోరేషన్‌ విభాగంలో టీబీజీకేఎస్‌ పిట్‌ కార్యదర్శి మైదం వీరస్వామి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. సింగరేణి ఏరియా దవాఖానాలో అడిషనల్‌ చీఫ్‌ మెడికల్‌ అధికారి కొండబత్తిని అశోక్‌కుమార్‌కు  టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో పిట్‌ కార్యదర్శి అనుముల సత్యనారాయణ వినతి పత్రం ఇచ్చా రు. కార్యక్రమంలో కేంద్ర కమిటీ నాయకులు గెల్లి రాజలింగు, స్ట్రక్చరల్‌ కమిటీ సభ్యుడు గజెల్లి చంద్రశేఖర్‌, చీఫ్‌ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి కానగంటి కుమారస్వామి, ఆర్గనైజింగ్‌ కార్యదర్శులు స్వరూ పారాణి, సోకాల శ్రీనివాస్‌, అసిస్టెంట్‌ పిట్‌ కార్యదర్శి బీ రసరంజని కుమారి, సంయుక్త కార్యదర్శి గుమాస తిరుపతి, సిరికొండ శంకర్‌ పాల్గొన్నారు. 

కాసిపేట : కాసిపేట గని, కాసిపేట 2 ఇైంక్లెన్‌ భూగర్భ గనులపై టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో కార్మికులు కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. 2 ఇైంక్లెన్‌పై టీబీజీకేఎస్‌ ఏరియా కార్యదర్శి వొడ్నాల రాజన్న, పిట్‌ కార్యదర్శి కారుకూరి తిరుపతి, తాళ్లపల్లి శ్రావణ్‌, సిద్ధయ్య పాల్గొన్నారు. కాసిపేట గనిపై పిట్‌ కార్యదర్శి దుగుట శ్రీనివాస్‌, ఏరియా సహాయ కార్యదర్శి మేడ సమ్మయ్య, కార్మిక నేతలు బైరి శంకర్‌, బండారి రమేశ్‌, సొల్లంగి శ్రీనివాస్‌, పెండ్యాల నర్సయ్య, కార్మికులు పాల్గొన్నారు. 

తాండూర్‌ :  మండలంలోని బీపీఏ ఓసీపీ-2 గని ఆవరణలో టీబీజీకేఎస్‌ కార్పొరేట్‌ చర్చల ప్రతినిధి దరావత్‌ మంగీలాల్‌ ఆధ్వర్యంలో  కేంద్ర ప్రభుత్వం దిష్టి బొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో సెంట్రల్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ సంగెం ప్రకాశ్‌, పిట్‌ సెక్రటరీ ఏలూరి రవి, నాయకులు సంపత్‌రావు, రామారావు, చంద్రకుమార్‌, వెంకటేశ్‌, అన్నం లక్ష్మయ్య, మైన్స్‌ కమిటీ, సేఫ్టీ కమిటీ నాయకులు పాల్గొన్నారు.

2న సమ్మెలో పాల్గొనాలి

శ్రీరాంపూర్‌ : బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సింగరేణిలో జూలై 2న చేపట్టే  సమ్మెలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్షుడు కే సురేందర్‌ రెడ్డి పిలుపునిచ్చారు.  గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్‌ శుక్రవారం సింగరేణి వ్యాప్తంగా కేంద్ర ప్రభు త్వ  దిష్టి బొమ్మలను దహనం చేసింది. ఎస్సా ర్పీ 3గనిపై ఉపాధ్యక్షుడు కే సురేందర్‌రెడ్డి, పిట్‌ కార్యదర్శి గోపాల్‌రెడ్డి, ఆర్కే న్యూటెక్‌ గనిపై డిప్యూటీ ప్రధాన కార్యదర్శి అన్నయ్య, చర్చల ప్రతినిధి బుస్స రమేశ్‌, పిట్‌ కార్యదర్శి శ్రీరాములు, ఆర్కే 7గనిపై కేంద్ర చర్చల ప్రతినిధి కే వీరభద్రయ్య, చర్చల ప్రతినిధి అశోక్‌, పిట్‌ కార్యదర్శి మెండ వెంకటి, ఎస్సార్పీ1పై కేంద్ర చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్‌రెడ్డి, పిట్‌ కార్యదర్శి ఎంబడి తిరుపతి, ఓసీపీపై రీజియన్‌ కార్యదర్శి మంద మల్లారెడ్డి, పిట్‌ కార్యదర్శి పెంట శ్రీనివాస్‌, ఆర్‌కే 6గనిపై చర్చల ప్రతినిధి వెంగళ కుమారస్వామి, పోశెట్టి, పిట్‌ కార్యదర్శి చిలుముల రాయమల్లు, ఆర్‌కే 5గనిపై చర్చల ప్రతినిధి నెల్కి మల్లేశం, పిట్‌ కార్యదర్శి ఆర్‌ మహేందర్‌రెడ్డి, ఆర్‌కే 5బీ గనిపై ఏరియా చర్చల ప్రతినిధి పెట్టం లక్ష్మణ్‌, పిట్‌ కార్యదర్శి సత్యనారాయణ, నీలం సదయ్య, ఆర్కే 8గనిపై రాజనాల రమేశ్‌, తొంగల రమేశ్‌, పిట్‌ కార్యదర్శి పెండ్లి రవీందర్‌, సీఎస్పీపై చాట్ల అశోక్‌, శ్రీనివాస చారి, వర్క్‌షాప్‌పై చర్చల ప్రతినిధి రాఘవరెడ్డి, పిట్‌ కార్యదర్శి వెంకటేశ్వర్లు, స్టోర్‌లో పిట్‌ కార్యదర్శి, నస్పూర్‌ చైర్మన్‌ ఇసంపెల్లి ప్రభాకర్‌, సదానందం, సివిల్‌ డిపార్ట్‌మెంట్‌లో పిట్‌ కార్యదర్శి ప్యాగ మల్లేశం, కేంద్ర నాయకులు సమ్మయ్య ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ  దిష్టిబొమ్మలను దహనం చేశారు. గౌరవాధ్యక్షురాలు కవిత, అధ్యక్షుడు వెంకట్రావ్‌, ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి జూలై 2న సింగరేణి గనుల్లో, ఓసీపీల్లో సమ్మెకు పిలుపునిచ్చారని తెలిపారు. logo