గురువారం 22 అక్టోబర్ 2020
Mancherial - Jun 25, 2020 , 00:13:57

స్లాట్‌ బుకింగ్‌ ఉంటేనే రిజిస్ట్రేషన్‌

స్లాట్‌ బుకింగ్‌ ఉంటేనే రిజిస్ట్రేషన్‌

  • క్రయ,విక్రయదారులు కార్యాలయానికి రావద్దు
  • కొవిడ్‌ నిబంధనలు తప్పక పాటించాలి
  • ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌ రవికాంత్‌

మంచిర్యాల రూరల్‌ (హాజీపూర్‌): మంచిర్యాల జిల్లాలో భూముల క్రయ,విక్రయాలు నిర్వహించే  వారు ముం దుగా ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకొని సబ్‌ రిజిస్ట్రార్‌ కా ర్యాలయానికి రావాలని మంచిర్యాల సబ్‌ రిజిస్ట్రార్‌ రవికాంత్‌ అన్నారు. బుధవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’ తో మాట్లాడుతూ క్రయ,విక్రయదారులు కార్యాలయం పరిసరాల్లో గుంపులు గుంపులుగా ఉండరాదని సూచించారు. ఆన్‌లైన్‌ స్లాట్‌ ద్వారా ఇచ్చిన సమయానికి కార్యాలయానికి వచ్చి తమ భూముల రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు. క్రయ,విక్రయ దారులతో ఇద్దరు సాక్షులను మాత్రమే కార్యాలయంలోకి అనుమతిస్తామని తెలిపారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వచ్చే వారు నిబంధనలు పాటించా లని కోరారు. ప్రతి రోజూ 40 డాక్యుమెంట్ల ను మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేస్తామని తెలిపారు. 

 సమయ పాలన పాటించాలి

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో భూముల క్రయ, విక్రయాలను నిర్వహించే ఇరు పార్టీ లు తమకు ఆన్‌లైన్‌ ద్వారా ఇచ్చిన సమయానికే రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి రావాలి.  సంబంధిత దస్తావేజు లేఖరు వద్దే తమ క్రయ, విక్రయానికి సంబంధించిన కాగితాలను పరిశీలించుకొని సబ్‌ రిజిస్ట్రార్‌ వద్దకు వెళ్లాలన్నారు. తప్పనిసరిగా మాస్క్‌ ధరించి కొవిడ్‌ నిబంధనలను పాటించాలన్నారు. -దీపక్‌ ఉపాధ్యాయ, జిల్లా అధ్యక్షుడు, దస్తావేజు లేఖరుల సంఘం logo