ఆదివారం 25 అక్టోబర్ 2020
Mancherial - Jun 25, 2020 , 00:08:15

నేడు మంచిర్యాల జిల్లాకు మంత్రి కొప్పుల ఈశ్వర్‌

నేడు మంచిర్యాల జిల్లాకు మంత్రి కొప్పుల ఈశ్వర్‌

మంచిర్యాల రూరల్‌ (హాజీపూర్‌)/జైపూర్‌/కోటపల్లి: ఆరో విడుత హరితహారంలో భాగంగా గురువారం జైపూర్‌ మండలం ఇందారం గ్రామ శివారులోని రసూల్‌పల్లె రహదారి (హైవే) పక్క న ఉదయం 11-15 గంటలకు రాష్ట్ర షెడ్యూల్‌ కులాల అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ప్రభుత్వ విప్‌ బాల్కసుమన్‌తో కలిసి మొక్కలు నాటనున్నట్లు కలెక్టర్‌ భారతీహోళికేరి తెలిపారు. రసూల్‌పల్లి అటవీ శివారులో అటవీ, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో 20 వేల మొ క్కలు నాటనుండగా, మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ ప్రారంభించనున్నా రు. బుధవారం ఎఫ్‌డీవో వినయ్‌కుమార్‌ సా హు, డీఆర్‌డీఏ పీడీ శేషాద్రి ఏర్పాట్లను పరిశీలించారు. ఎంపీపీ రమాదేవి, ఎంపీడీవో నాగేశ్వర్‌రెడ్డి, ఎంపీవో సతీశ్‌కుమార్‌, ఎఫ్‌ఎస్‌వో సాగరిక, నాయకులు గోదారి లక్ష్మణ్‌, పాండరి ఉన్నా రు. కోటపల్లి మండలం మల్లంపేట, వెలమపల్లి, దేవులవాడ, సిర్సా గ్రామాల్లో నిర్వహించనున్న కార్యక్రమాల్లోనూ ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌, జడ్పీ అధ్యక్షురాలు నల్లాల భాగ్యలక్ష్మీ పాల్గొననున్నట్లు ఎంపీపీ మంత్రి సురేఖ, వైస్‌ ఎంపీపీ శ్రీనివాస్‌రావు, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు బైస ప్రభాకర్‌ తెలిపారు.logo