శనివారం 31 అక్టోబర్ 2020
Mancherial - Jun 24, 2020 , 01:54:52

హరితోత్సవానికి రెడీ !

హరితోత్సవానికి రెడీ !

l ఆరో విడుత కార్యక్రమానికి    ఏర్పాట్లు పూర్తి 

lనర్సరీల్లో మొక్కలు సిద్ధం

lవిజయవంతానికి అధికారుల   పకడ్బందీ చర్యలు

lమండలంలో 3.5 లక్షల   మొక్కలు నాటేలా ప్రణాళిక

l15 జీపీల్లో 15 నర్సరీలు ఏర్పాటు                                 

టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరో విడత హరితహారానికి ఏర్పాట్లు పూర్తయ్యా యి. ఈ నెల 25న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. 15 గ్రామ పంచాయతీల్లోని నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేశారు. దీంతోపాటు రేపల్లెవాడ సమీపంలో అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలు పెంచారు. పంచాయతీ రాజ్‌ నూతన చట్టం ప్రకారం గ్రామాల్లో నాటిన మొక్కల్లో తప్పని సరిగా 85 శాతం బతికించాల్సిందే. వాటిని సం రక్షించే బాధ్యతను సర్కారు సర్పంచ్‌ లు, కార్యదర్శులకు అప్పగించింది. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సి ఉంటుంది. - తాండూర్‌ 

మండలంలో 3.5లక్షలు మొక్కలు నాటేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఉపాధి హామీ పథకం ద్వారా మండ లంలోని 15 గ్రామ పంచాయతీల పరిధిలో 15 నర్సరీలు ఏర్పాటు చేశారు. వీటిలో టేకు, పండ్ల, పూల, అడవి, నీడని చ్చే మొక్కలు మొత్తం 1,34,600 పెంచారు. నీలాయపల్లిలో అటవీ శాఖ పరిధిలో రేపల్లెవాడ సమీపంలో 2 లక్షల మొక్క ల పెంపకం చేపట్టారు. ఇందులో అన్నిరకాల మొక్కలను హరితహారానికి సిద్ధం చేశామని డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌ జే తిరుపతి పేర్కొన్నారు. 25వ తేదీన అన్నిగ్రామాల్లో మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నర్సరీలను కలెక్టర్‌ భారతీ హోళికేరి, డీపీవో వీరబుచ్చయ్య ఎప్పటి క ప్పుడు పరిశీలించారు. హరితహారం విజయవంతానికి పక డ్బందీ చర్యలు తీసుకుంటున్నామని ఎంపీపీ పూసాల ప్రణ య్‌కుమార్‌, ఎంపీడీవో శశికళ తెలిపారు.

స్వచ్ఛందంగా తరలిరావాలి..

వనమహోత్సవం కోసం నర్సరీల్లో మొక్క లు సిద్ధం చేశాం. ఇందు లో ప్రతి ఒక్కరూ స్వ చ్ఛందంగా పాల్గొని మొ క్కలు నాటాలి. ఇది ఓ పచ్చని పండుగలా జరు పుకుంటాం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం చేపడుతున్నది. చెట్లు పర్యావరణ పరిరక్షణతోపాటు వర్షాలు అధికంగా కురిసేందుకు దోహదపడుతాయి. 

- ఎంపీపీ పూసాల ప్రణయ్‌కుమార్‌, తాండూర్‌