మంగళవారం 27 అక్టోబర్ 2020
Mancherial - Jun 21, 2020 , 00:09:10

రైతు సంక్షేమం కోసమే జలహితం

రైతు సంక్షేమం కోసమే జలహితం

  • వర్షపు నీటిని ఒడిసిపట్టి పొలాలకు మళ్లిస్తాం
  • ఉపాధి కూలీలతో కాలువలకు మరమ్మతులు
  • మంచిర్యాల కలెక్టర్‌ భారతీ హోళికేరి
  • వెంకటాపూర్‌లో కడెం కెనాల్‌ 38వ డిస్ట్రీబ్యూటరీ వద్ద పనులు ప్రారంభం
  • సీఎం కేసీఆర్‌ రైతు పక్షపాతి :  ఎమ్మెల్యే దివాకర్‌రావు

లక్షెట్టిపేట రూరల్‌: రైతుల సంక్షేమం కోసమే ప్రభుత్వం జలహితం కార్యక్రమం నిర్వహిస్తున్నదని మంచిర్యాల కలెక్టర్‌ భారతీ హోళికేరి అన్నారు. లక్షెట్టిపేట మండలంలోని జెండా వెంకటాపూర్‌లో కడెం కెనాల్‌ 38వ డిస్ట్రిబ్యూటరీ వద్ద శనివారం ఎమ్మెల్యే దివాకర్‌ రావుతో కలిసి టెంకాయ కొట్టి జలహితం పనులను ప్రారంభించా రు. అనంతరం మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత రైతులకు ఎంతో మేలు జరిగిందన్నారు. ప్రస్తుతం రైతులకు సాగుకు పూర్తి స్థాయిలో నీరందుతున్నదని తెలిపారు. కడెం కెనాల్‌ నుంచి చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించేందుకు కెనాల్‌ మొత్తం శుభ్రం చేయనున్నట్లు చెప్పారు. ఈ పనులను ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ద్వారా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అడవుల్లో వృథాగా పో తున్న వర్షపు నీటిని ఒడిసి పట్టి చెరువుల్లోకి, పంట పొలాల్లోకి సక్రమంగా చేరేలా కాలువలను జలహితం ద్వారా పునరుద్ధరించాలని నిర్ణయించామన్నారు. గతంలో కెనాల్‌ పూడిక తీత పనులు, పిచ్చి మొక్కలు తొలగించాలంటే ఇరిగేషన్‌ శాఖకు నిధులు అవసరం అ య్యేదని, ఆ నిధులు మంజూరు కాక కాలువల్లో పిచ్చి మొక్కలు పెరిగేవన్నారు. ఎమ్మెల్యే దివాకర్‌ రావు మాట్లాడుతూ... సీఎం కేసీ ఆర్‌ రైతు పక్షపాతి అని కొనియాడారు. రైతుల కోసం అనేక పథకాలను ప్రవేశ పెట్టారని గుర్తు చేశారు. అడిషనల్‌ కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, డీఆర్డీవో శేషాద్రి, మండల ప్రత్యేకాధికారి వీరయ్య, డీసీఎంఎస్‌ చైర్మన్‌ తిప్పని లింగన్న, జడ్పీటీసీ ముత్తె సత్తయ్య, ఎం పీపీ అన్నం మంగ, ఎంపీటీసీ సరిత, సర్పంచ్‌ ఎల్తాపు సునీత, ము న్సిపల్‌ చైర్మన్‌ పలమాసు కాంతయ్య, వైస్‌ చైర్మన్‌ పొడేటి శ్రీనివాస్‌ గౌడ్‌, ఇరిగేషన్‌ ఈఈ రాజశేఖర్‌, డీఈ ధశరథం, ఈఈ అశ్విన్‌, ఎంపీడీవో సత్యనారాయణ, ఏవో ప్రభాకర్‌, ఆర్‌ఐ సంజయ్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ మండలాధ్యక్షుడు చుంచు చిన్నయ్య, నాయకులు శ్రీనివాస్‌ రెడ్డి, జగన్‌ రెడ్డి, కాసు సురేశ్‌, భూమన్న, శ్రీకర్‌, సుధాకర్‌, గంగాధర్‌, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

మొక్కలు నాటిన కలెక్టర్‌ 

 లక్షెట్టిపేట మండలం జెండా వెంకటాపూర్‌లో కలెక్టర్‌  మొక్కలు నాటారు. తెలంగాణాకు హరితహారం కార్యక్రమాన్ని విజయవం తం చేయాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సుమారు 100 మొక్కలను నాటారు. ఆమె వెంట ప్రత్యేకాధికారి వినోద్‌ కుమార్‌, ఎంపీడీవో సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.logo