సోమవారం 19 అక్టోబర్ 2020
Mancherial - Jun 18, 2020 , 00:46:43

గ్రంథాలయాభివృద్ధికి ప్రతిఒక్కరూ పాటుపడాలి

గ్రంథాలయాభివృద్ధికి ప్రతిఒక్కరూ పాటుపడాలి

  • జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రేణికుంట్ల ప్రవీణ్‌ 

బెల్లంపల్లిటౌన్‌ :  పట్టణం నడిబొడ్డున నిర్మాణమవుతున్న గ్రంథాలయాభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రేణికుంట్ల ప్రవీణ్‌ కోరారు. గ్రంథాలయ ఆవరణలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భవన ప్రహరీ విషయంలో కౌన్సిలర్‌ భర్త శంకర్‌సింగ్‌ అధికారులు, కాంట్రాక్టర్‌ను బెదిరింపులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. ఆయన సొంత ఆస్తి అన్నట్లుగా వ్యవహరిస్తూ అధికారులను ఇబ్బందులకు గురిచేస్తూ నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని విమర్శించారు. పట్టణ నడిబొడ్డున ఉన్న గ్రంథాలయ భవన నిర్మాణం పూర్తయితే ఎడ్యుకేషన్‌ హబ్‌గా మారుతుందన్నారు. రూ.2 కోట్లతో ఇక్కడ అంబేద్కర్‌ స్టడీ సర్కిల్‌ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. గ్రంథాలయ భవన నిర్మాణ పను ల్లో తలదూర్చి అడ్డంకులు సృష్టించవద్దని సూచించారు. సమావేశంలో గజెల్లి చంద్రశేఖర్‌, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. 


logo