శనివారం 24 అక్టోబర్ 2020
Mancherial - Jun 17, 2020 , 02:09:31

యోగా ‘కురువృద్ధుడు’

యోగా ‘కురువృద్ధుడు’

lనేటికీ సంపూర్ణ ఆరోగ్యంతో స్వతహాగా దినచర్యలు

lఔత్సాహికులకు శిక్షణ తరగతులు

lఅబ్బురపరుస్తున్న చిట్యాల బాలయ్య

మెట్‌పల్లి పట్టణం కళానగర్‌కు చెందిన బాలయ్య చదువుతున్న రోజుల్లో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌)లో సభ్యుడిగా ఉన్నాడు. అప్పుడే కర్ర సాము, నాన్‌చాక్‌ తదితర విభాగాల్లో శిక్షణ పొందాడు. అటు తర్వాత స్థానిక ప్రభుత్వ దవాఖానలో కంపౌండర్‌గా చేసి ఉద్యోగ విరమణ పొం దాడు. ఆ తర్వాత యోగాసనాలపై దృష్టి పెట్టాడు. నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌కు చెందిన యోగానందస్వామి శిష్యరికంలో బెంగళూర్‌లోని వివేకానంద యోగా అనుసంధాన సంస్థాన్‌లో యోగాభ్యాసం చేసి ధ్రువీకరణ పత్రం పొందాడు. ప్రముఖ యోగాచారిణి వనజారెడ్డితో కలిసి హైదరాబాద్‌, కరీంనగర్‌ తదితర ప్రాంతాల్లో యోగా ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించాడు. ఎన్నో రోజులు సాధన చేస్తే గానీ సాధ్యం కాని పలు ఆసనాలను సైతం ఆయన ఈ వయస్సులోనూ అలవోకగా వేస్తాడు. 30ఏళ్లుగా క్రమం తప్పకుండా రోజూ రాత్రి 2గంటల నుంచి ఉదయం4 గంటల వరకు 160కి పైగా ఆసనాలు వేస్తుంటాడు. రోజూ ఆసనాలు వేస్తుండడం, సరైన ఆహార నియమాలు పాటిస్తుండడంతో ఆయనకు ఎలాంటి అనారోగ్య సమస్యలూ దరిచేరలేదు. ఎలాంటి మందుగోలీలు, ఇంజిక్షన్లు వాడడం లేదు. దగ్గర, దూరపు చూపు అనే సమస్య అంతకన్నా లేదు. ఆసనాలతో పాటు కంటికి సంబంధించిన క్రియలను సైతం రోజూ చేస్తుండడం వల్ల సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని చెబుతున్నాడు. అంతేకాదు ఔత్సాహికులకు పట్టణ శివారులోని వివేకానంద కేంద్రంలో ఆసనాలపై ఉచిత శిక్షణ ఇస్తున్నాడు. ఆయన ఫిజియోథెరపీ, సుజక్‌ థెరపీలోనూ ప్రావీణ్యం పొందడమేగాక, ఆలిండియా ఫిజియోథెరపీ విశ్వవిద్యాలయం నుంచి పట్టా కూడా సాధించడం విశేషం. logo