శుక్రవారం 23 అక్టోబర్ 2020
Mancherial - Jun 16, 2020 , 00:48:36

ఆస్నాద్‌ అడవిలో పెద్దపులి అలజడి

ఆస్నాద్‌ అడవిలో పెద్దపులి అలజడి

n  అడుగులను పరిశీలించిన    అటవీ అధికారులు

  n  గ్రామాల ప్రజలు   అప్రమత్తంగా ఉండాలి

చెన్నూర్‌ రూరల్‌: మంచిర్యాల జిల్లాలో రెండు రోజులుగా పెద్దపులి హల్‌చల్‌ చేస్తున్నది. జైపూర్‌, భీమారం మండలాల్లో సంచరించిన పెద్దపులి చెన్నూర్‌ మండలంలోకి ప్రవేశించింది. జైపూర్‌ మండలం కుందారం మీదుగా చెన్నూర్‌ మండలంలోని సోమన్‌పల్లి, ఆస్నాద్‌ గ్రామాలలోని అటవీ ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నది. ఆస్నాద్‌ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో బలిజమట్ట వాగు వద్దకు వెళ్లిన రైతులు పులి అడుగులను గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు అడుగులను పరిశీలించి పెద్దపులి వని ధ్రువీకరించారు. చెన్నూ ర్‌ మండలంలోని అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నదని, ఆయా గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎఫ్‌డీవో రాజారావు పేర్కొన్నారు. పెద్దపులికి ఎలాంటి హాని తలపెట్టవద్దని, పులితో పశువులకు ఏదైనా నష్టం సంభవిస్తే తగిన నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపారు. అటవీ ప్రాంతాలకు పశువులను పంపవద్దని రైతులను కోరారు. ప్రజలు కూడా అటవీ ప్రాంతాల వైపు వెళ్లకుండా ఉండాలని సూచించారు. పులి రక్షణ గురించి ప్రతి రోజూ గ్రామాల్లో దండోరా వేయిం చి, అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పులికి హాని తలపెడితే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 


logo