ఆదివారం 25 అక్టోబర్ 2020
Mancherial - Jun 12, 2020 , 03:23:24

సొంతూళ్లకు వలస కార్మికులు

సొంతూళ్లకు వలస కార్మికులు

కరీంనగర్‌రూరల్‌/ జ్యోతినగర్‌: లాక్‌డౌన్‌తో చిక్కుకుపోయిన వలస కార్మికులను గురువారం కరీంనగర్‌, రామగుండం నుంచి అధికారులు ప్రత్యేక రైళ్లలో తరలించారు. కరీంనగర్‌ నుంచి 1902 ఒడిశా కార్మికులతో నౌపాడ రైల్వేస్టేషన్‌కు బయలుదేరిన శ్రామిక్‌ రైలును అదనపు కలెక్టర్‌ జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. వీరి ప్రయాణానికి జిల్లా యంత్రాం గం అన్ని ఏర్పాట్లూ చేసింది. ప్రతి కార్మికుడికీ మినరల్‌ వాటర్‌, ఆహారంతో పాటు, చిన్న పిల్లలకు ప్రత్యేక కిట్స్‌ అందజేశారు. ప్రతి ఒక్కరికీ థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు, వైద్య పరీక్షలు నిర్వహించారు. కరీంనగర్‌నుంచి వెళ్లిన రైలులో కరీంనగర్‌, జగిత్యాల, సిరిసిల్ల నుంచి వచ్చిన 1679 మంది పెద్దలు, 223 మంది చిన్నపిల్లలు ఉన్నారు. రామగుండం నుంచి 1776 మంది ఒడిశా కార్మికులతో మరొక శ్రామిక్‌ రైలు వెళ్లింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ స్టేషన్‌కు చేరుకుని అధికారులకు సూచనలు ఇచ్చారు.


logo