మంగళవారం 20 అక్టోబర్ 2020
Mancherial - Jun 11, 2020 , 03:01:36

యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తాం

యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తాం

n సాగునీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్‌ పనుల్లో  వేగం పెంచుతాం

n భూ సేకరణ, నిధుల సమస్యలు లేకుండా చర్యలు చేపడుతాం

n ఆర్థిక, నీటిపారుదల శాఖ అధికారులతో చర్చించా

n రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌

n ఐదు అసెంబ్లీ సెగ్మెంట్ల పనులపై సమీక్ష పూర్తయినట్లు వెల్లడి

n   రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌

కరీంనగర్‌, నమస్తే తెలంగాణ: కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ స్పష్టం చేశారు. రిజర్వాయర్లకు అవసరమైన భూసేకరణ, నిధుల సమస్య లేకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌రావు, భూ సేకరణ అధికారి మనోహర్‌ సహా పలువురు ఉన్నతాధికారులతో కలిసి బుధవారం హైదరాబాద్‌లో చర్చించారు. అనంతరం ఆయన వివరాలు వెల్లడించారు. కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులు, రిజర్వాయర్‌ పనులు, కాలువల కోసం భూసేకరణ అంశాలు సకాలంలో పూర్తయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో విపులంగా చర్చించానని, ప్రాజెక్టులు, రిజర్వాయర్‌ పనులు వేగవంతంగా, లక్ష్య సాధనతో పూర్తి చేయాలని అధికారు లు, ఇంజినీర్లు, కాంట్రాక్టర్లను ఆదేశించానని స్ప ష్టం చేశారు. కొవిడ్‌-19 సందర్భంగా శ్రీపాద ఎల్లంపల్లి, కాళేశ్వరం ప్రాజెక్టుల పరిధిలోని పనులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ము ఖ్యంగా హుస్నాబాద్‌, చొప్పదండి, వేములవాడ, మానకొండూర్‌, సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లోని సాగునీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్‌ పనుల పూర్తి కోసం స్థానిక ఎమ్మెల్యేలు, ఇంజినీర్లు, అధికారులతో కలిసి సమీక్షలు నిర్వహించినట్లు చెప్పా రు. ఈ ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో శ్రీపాద ఎల్లంపల్లి, కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. కరీంనగర్‌, హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటికే శ్రీరాంసాగర్‌ కాలువల ద్వారా నీళ్లు వస్తున్నాయని గుర్తు చేశారు. మే 2న మానకొండూర్‌, మే 30న హుస్నాబాద్‌, ఈ నెల 4న చొప్పదండి, వేములవాడ, 9న సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లపై సమీ క్షా సమావేశాలు నిర్వహించినట్లు స్పష్టం చేశారు.

కారు దిగి.. చేన్లకు వెళ్లి..!
n  మహిళా రైతులతో వినోద్‌కుమార్‌ మాటా ముచ్చట

రామడుగు : మండలంలోని వెదిర వద్ద కరీంనగర్‌- జగిత్యాల రహదారి పక్కన చేన్లలో బుధవారం మధ్యాహ్నం పత్తి విత్తనాలు విత్తుతున్న మహిళా రైతులను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ గంగాధరవైపు వెళ్తూ గమనించి కారు దిగి వెళ్లి పలుకరించారు. ఎలాంటి పంటలు వేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ‘సీఎం కేసీఆర్‌ చెప్పినట్లే పంటలు వేస్తున్నారా?’ అని అడుగగా ‘సారు చెప్పినట్లే నడుచుకుంటాం’ అని వారు సమాధానమిచ్చారు. వరితో పాటు పత్తి, కంది వేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా వినోద్‌ సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం వారినుద్దేశించి మాట్లాడారు. రైతులందరూ ముఖ్యమంత్రి నిర్ణయాన్ని శిరోధార్యంగా భావిస్తున్నారని పేర్కొన్నారు. ఆయన సూచనల మేరకే నియంత్రిత సాగుపై దృష్టి పెట్టారన్నారు. రైతుల కష్టాలను చూసే మూడేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని తెలిపారు. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలే వేయాలని సూచించారు. ఆయన వెంట ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, టీఆర్‌ఎస్‌ యూత్‌ నేత డాక్టర్‌ అమిత్‌రావు ఉన్నారు.logo