ఆదివారం 25 అక్టోబర్ 2020
Mancherial - Jun 11, 2020 , 01:40:42

వర్ష బీభత్సం

వర్ష బీభత్సం

 n ఈదురుగాలులకు  నెలకొరిగిన వృక్షాలు

 n  విరిగిన విద్యుత్‌ స్తంభాలు

కాసిపేట/మందమర్రి/ఆసిఫాబాద్‌/మంచిర్యాల : మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో బుధవారం అక్కడక్కడా భారీ వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లా కాసిపేట, మందమర్రిలో సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. మందమర్రి సోమగూడెం రహదారి మధ్యలో చొప్పరిపల్లి సమీప రహదారి పై భారీ వృక్షం నేలకొరగడంతో మందమర్రి బెల్లంపల్లి వైపు వెళ్లే వాహనాలను పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. సోమగూడెం చౌరస్తాలో చెట్టు కొమ్మలు విరిగిపడి నాలుగు బైక్‌లు ధ్వంసమయ్యాయి. కాసిపేట దేవాపూర్‌ రహదారి మధ్యలో వృక్షాలు రోడ్డు పై పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు ఇండ్లపై చెట్లు పడి స్వల్పంగా దెబ్బతిన్నాయి. మందమర్రి కేకే రెండు ఓసీపీ సమీపంలో చెట్లు విరిగి పడడంతో వాహణాల రాకపోకలకు అంతరాయం కలిగింది. సీసీసీ నస్పూర్‌లో గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గౌతమినగర్‌లో విద్యుత్‌ స్తంభం నేలకొరిగింది. చెట్లు విరిగిపడి కరెంట్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో గంటన్నర పాటు  వర్షం పడింది.logo