ఆదివారం 25 అక్టోబర్ 2020
Mancherial - Jun 11, 2020 , 01:39:02

హరితహారానికి మొక్కలు సిద్ధం

హరితహారానికి మొక్కలు సిద్ధం

నర్సరీల్లో 2,51,880 మొక్కలు

దహెగాం: పర్యావరణాన్ని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా హరితహారం కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నది. కాగా ఈ యేడు ఆరో విడుత హరితహారం కార్యక్రమం త్వరలో ప్రారంభం కానున్నది. జాతీ య ఉపాధి హామీ పథకం ద్వారా  ప్రతి గ్రామ పం చాయతీకి ఒకటి చొప్పున 24 నర్సరీలు ఏర్పాటు చేసి టేకు, కానుగ, ఉసిరి, దానిమ్మ, జామ, పప్పాయ, అడవి తంగ్గేడు, గుల్‌మోరు తదితర 2,51,880 మొక్కలు నాటేందుకు సిద్ధం చేశారు. చింత, అల్లనేరడి, రేగు, రావి, మర్రి లాంటి 78 వేల మొక్కలు ఇతర ప్రాంతం నుంచి తీసుకురావడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కాగా అటవీ శాఖ ద్వారా కూడా మొక్కలను నాటేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఇందుకు గాను మండలంలోని కల్వాడ గ్రామం లో అటవీ శాఖ ద్వారా ఏర్పాటు చేసిన నర్సరీలో 90 వేల మొక్కలు పెంచుతున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం సత్ఫలితాలను అందించే దిశగా సాగుతుంది.

ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేరుస్తాం 

హరితహారంలో ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేరుస్తాం. మండలంలో 24 నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నాం. దీనిపై ఈజీఎస్‌ సిబ్బంది, గ్రామ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆరో విడుతలో పూర్తి స్థాయిలో మొక్కలు నాటి సంరక్షించేందుకు ప్రణాళికలు తయారు చేశాం. ఇప్పటికే గ్రామాల్లో గుంతలు తవ్విస్తున్నాం.

                      -సత్యనారాయణ, ఎంపీడీవో, దహెగాం


logo