మంగళవారం 27 అక్టోబర్ 2020
Mancherial - Jun 09, 2020 , 02:10:33

సేంద్రియ పద్ధతిలో పంటలు పండించాలి

సేంద్రియ పద్ధతిలో పంటలు పండించాలి

ఆసిఫాబాద్‌: రైతులు సేంద్రియ పద్ధతిలో పంటలు పండించాలని ఎంపీపీ అరిగెల మల్లికార్జున్‌ యాదవ్‌ సూచిం చారు. సోమవారం మండలంలోని ఆడ గ్రామానికి చెందిన గుర్నులే శారద సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో కూరగాయలు సాగు చేస్తున్నందున ఆటో రిక్షా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు శారదను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్‌ అలీబీన్‌ హైమద్‌, ఈవోపీఆర్డీ ప్రసాద్‌, ఏపీడీ అన్నాజీ, సారయ్య, యాదగిరి, డీపీ ఎం శ్రీనివాస్‌, భూమక్క, భీంరావు, రమేశ్‌, సీసీ రమేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

రుణాలు సద్వినియోగం చేసుకోవాలి 

కాగజ్‌నగర్‌ రూరల్‌: రైతులు బ్యాంకు ద్వారా అందించే రుణాలు సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణారావు సూచించారు. సోమవారం వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయంలోని పీఏసీఎస్‌ కార్యాలయంలో రైతులకు పంట రుణాల చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  తెలంగాణ ప్రభుత్వం రైతును రాజుగా చూడాలనే రుణాలు మాఫీ చేసిందన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ ఉమామహేశ్వర్‌రావు, ఎంపీపీ చీపురుశెట్టి శంకర్‌, మాజీ జడ్పీటీసీ లక్ష్మణ్‌, డైరెక్టర్లు, సిబ్బంది సతీశ్‌ పాల్గొన్నారు.



logo