మంగళవారం 27 అక్టోబర్ 2020
Mancherial - Jun 09, 2020 , 02:08:58

పరిశుభ్రతతోనే గ్రామ ప్రగతి

పరిశుభ్రతతోనే గ్రామ ప్రగతి

దహెగాం ఎంపీడీవో సత్యనారాయణ

ముగిసిన పారిశుధ్య కార్యక్రమాలు

దహెగాం: పరిసరాలను పరిశుభ్రతతోనే  గ్రామ ప్రగతికి బాటలు పడతాయని ఎంపీడీవో సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం మండలంలోని పెసర్‌గుంట గ్రామంలో చేపట్టిన పారిశుధ్య పనులను పరిశీలించారు. తాగునీటి బావుల్లో క్లోరినేషన్‌, ఇంకుడు గుంతల నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీవో రాజేశ్వర్‌, సర్పంచ్‌ నక్క పద్మ, కార్యదర్శి జ్యోతి, నాయకులు సునీల్‌ పాల్గొన్నారు. ఆసిఫాబాద్‌ టౌన్‌: పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా మండలంలోని చిర్రకుంట, అంకుషాపూర్‌, బాబాపూర్‌ గ్రామాలను సోమవారం ఎంపీపీ మల్లికార్జున్‌యాదవ్‌ సందర్శించారు. హరితహారం కోసం సిద్ధం చేస్తున్న నర్సరీలోని మొక్కలను పరిశీలించారు. చిర్రకంటలో తడిపొడి చెత్తబుట్టలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్‌ అలీ, సర్పంచ్‌ సోయం సార్వతి, లక్ష్మి, నాయకులు పిడుగు తిరుపతి, బలరాం, మల్లేశ్‌, ఇందులాల్‌ పాల్గొన్నారు. జైనూర్‌(సిర్పూర్‌(యు)): మండల కేంద్రంలో ఎంపీడీవో మధుసూదన్‌ సోమవారం ముమ్మరంగా పారిశుధ్య పనులు చేయించారు. కాలనీల్లో చెత్తాచెదరాన్ని తొలగించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చింతలమానేపల్లి: మండలంలోని గూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని నర్సరీని సోమవారం సర్పంచ్‌ రాఘవరెడ్డి పరిశీలించారు. గంగాపూర్‌లో ఐదుగురికి డెంగీ పాజిటివ్‌ రాగా ఎంపీవో రెహమాన్‌ఖాన్‌ గ్రామంలోని నాలాల్లోని పూడిక, పారిశుధ్య పనులు పరిశీలించారు. కార్యక్రమాల్లో ఫారెస్టు అధికారులు, నాయకులు ప్రభాకర్‌, అశోక్‌రెడ్డి, కార్యదర్శులు పాల్గొన్నారు. లింగాపూర్‌: పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా మండలంలోని చోర్‌పల్లి గ్రామంలో సోమవారం ప్రజలకు చెత్తబుట్టలు వైస్‌ఎంపీపీ ఆత్మారాం పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మనోహర్‌ , తదితరులు పాల్గొన్నారు. 


logo