బుధవారం 21 అక్టోబర్ 2020
Mancherial - Jun 07, 2020 , 02:13:21

పారిశుధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలి

పారిశుధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలి

ఆసిఫాబాద్‌ కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా

 జైనూర్‌: ప్రత్యేక పారిశుధ్య పనులను పకడ్బందీగా చేపట్టాలని ఆసిఫాబాద్‌ కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా ఆదేశించారు. సిర్పూర్‌(యు) మండలంలోని భుర్నూర్‌, ధనోర గ్రామపంచాయతీలను శనివారం  ఆయన సందర్శించారు. గ్రామాల్లో చేపడుతున్న పారిశుధ్య పనులు, నిర్మాణంలో ఉన్న ఇంకుడు గుంతలు, శ్మశాన వాటికలు, డంపింగ్‌ యార్డులు, ఉపాధిహామీ నర్సరీలను పరిశీలించారు. సిర్పూర్‌(యు) మండలంలోని ధనో ర గ్రామంలో మధ్యాహ్నం వేళ విద్యుత్‌ దీపాలు వెలుగుతుండడంతో విద్యుత్‌ శాఖ ఏఈ కవితపై ఆగ్రహం వ్యక్తంచేశారు. భుర్నూర్‌లో మిషన్‌ భగీరథ పైప్‌ లీకేజీతో నీరు వృథా అవుతుండడంతో మిషన్‌ భగీరథ డీఈపై మండిపడ్డారు. పనులను 13లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామం లో తాగునీటి సమస్య ఉందని గ్రామస్తులు కలెక్టర్‌కు వివరించగా.. బోరు మంజూరు చేశారు. ఆయన వెంట ఎంపీడీవో మధుసూదన్‌, ఎంపీపీ తొడసం భాగ్యలక్ష్మి, వైస్‌ ఎంపీపీ ఆత్రం ఓంప్రకాశ్‌, డిప్యూటీ తహసీల్దార్‌ హీరాలాల్‌, గ్రామస్తులు, నాయకులున్నారు.logo