మంగళవారం 20 అక్టోబర్ 2020
Mancherial - Jun 07, 2020 , 01:48:22

మంత్రి ఈశ్వర్‌ ఔదార్యం..

మంత్రి ఈశ్వర్‌ ఔదార్యం..

 ఆరోగ్యం క్షీణించి మంచానికే పరిమితమైన వ్యక్తికి బ్యాంకు రుణం చెల్లింపు 

ధర్మపురి: ఓ ప్రమాదంలో గాయపడిన వ్యక్తిపై రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఔదార్యం చూపారు. వివరాలిలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా వెల్గటూర్‌ మండలం పడకల్‌ గ్రామానికి చెందిన కొదురుపాక మల్లేశం పెయింటర్‌గా పనిచేసేవాడు. రెండేళ్ల క్రితం తెలంగాణ గ్రామీణ బ్యాంకు రాజారాంపల్లి శాఖ ద్వారా అతడికి మంత్రి ఈశ్వర్‌ బీసీ కార్పొరేషన్‌ నుంచి రూ.2లక్షల సబ్సిడీ రుణం ఇప్పించారు. రుణంపొందిన కొద్ది రోజులకే ఓ ప్రమాదంలో మల్లేశం వెన్నెముకకు గాయం కాగా రెండుకాళ్లు చచ్చుబడిపోయాయి. ఓవైపు ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నది. మరోవైపు రుణం చెల్లించాలని బ్యాంకు అధికారులు ఒత్తిడి తీసుకురావడంతో బాధితుడు మల్లేశం మంత్రి ఈశ్వర్‌ను ఆశ్రయించాడు. మల్లేశం పరిస్థితి చూసిన మంత్రి  వెంటనే రూ.2లక్షల రుణానికి సంబంధించి సబ్సిడీ పోను వడ్డీతో సహా రూ.64,164లు బ్యాంకు మేనేజర్‌ పద్మలతకు శనివారం పంపించారు. వెల్గటూర్‌ ఏఎంసీ చైర్మన్‌ ఏలేటి కృష్ణారెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ గూడ రామ్‌రెడ్డి, నాయకులు రామ్‌చందర్‌గౌడ్‌, సింహాచలం జగన్‌, గంగయ్య, బాధితుడు మల్లేశం మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. 


logo