ఆదివారం 12 జూలై 2020
Mancherial - Jun 04, 2020 , 02:43:27

రోడ్ల మీద చెత్తాచెదారం ఉండొద్దు

రోడ్ల మీద చెత్తాచెదారం ఉండొద్దు

ప్రతి రోజూ పారిశుధ్య పనులు చేపట్టాలి

చెన్నూర్‌లో మార్పు రాకుంటే చర్యలు

భీమారం మండలంలో పర్యటన

మంచిర్యాల కలెక్టర్‌ భారతీ హోళికేరి

చెన్నూర్‌ రూరల్‌/భీమారం : చెన్నూర్‌ మున్సిపాలిటీలో రోడ్ల మీద చెత్తాచెదారం ఉండకుండా చూడాలని జిల్లా కలెక్టర్‌ భారతీ హోళికేరి అధికారులను ఆదేశించారు. ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా బుధవారం చెన్నూర్‌లో పారిశుధ్య పనులను ఆమె పరిశీలించారు. రోడ్ల మీద ఉన్న చెత్త కుప్పలను చూసి మున్సిపల్‌ కమిషనర్‌ బాపుపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. మళ్లీ చెన్నూర్‌ వచ్చే సరికి పరి స్థితిలో మార్పు రాకుంటే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పరిశుభ్రతపై అందరూ ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అనంతరం నర్సరీని పరిశీలించారు. హరితహారం కార్యక్రమానికి మొక్కలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఆమె వెంట మున్సిపల్‌ అధ్యక్షురాలు అర్చన గిల్డా, వైస్‌ చైర్మన్‌ ఎండీ నవాజ్‌, కౌన్సిలర్లు దోమకొండ అనీల్‌, జగనాధుల శ్రీనివాస్‌, గర్రె పల్లి శాంతారాణి, నాయకులు గర్రెపల్లి వెంకట నర్సయ్య, విజయ్‌, నాయిని సతీశ్‌, మహేందర్‌గౌడ్‌ ఉన్నారు. చెన్నూర్‌ తెలంగాణ గ్రామీ ణ బ్యాంక్‌ను కలెక్టర్‌ సందర్శించారు. ఖాతాదారులు బారు లు తీరడంతో కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రతలపై అవగాహన కల్పించారు.  బ్యాంక్‌ మేనేజర్‌ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ విక్టర్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ప్రకాశ్‌, బ్యాంక్‌ సిబ్బంది ఉన్నారు. భీమారం మండలం ఖాజీపల్లి, భీమారం గ్రామాల్లో కలెక్టర్‌ పర్యటించారు. భీమారం బస్టాండ్‌ ప్రాంతంలో రోడ్డు పక్క నే పండ్ల దుకాణాలు నిర్వహించడంపై అధికారులపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఖాళీ కొబ్బరి బొండాలను అక్కడే పడేయడం వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని కల్టెక్టర్‌ పేర్కొన్నారు. ఖాజీపల్లిలో టెంట్‌ హౌస్‌ సామగ్రి రోడ్లపై ఉం చడంపై వార్డు సభ్యుడిని మందలించారు. ఇతడికి రూ. 1000, ఇంటి ఎదుట కంకర పోసిన రాజయ్య అనే వ్యక్తికి రూ. 500 జరిమానా విధించా లని కార్యదర్శి నలిమల సంధ్యారాణికి ఆదేశించారు. దీంతో వారికి  జరిమానా విధించారు. తహసీల్దార్‌ విజయనందం, ఎంపీడీవో శ్రీనివాస్‌, ఎంపీవో శ్రీపతి బాపు, సర్పంచ్‌లు గద్దెరాంరెడ్డి, దాడి తిరుపతి, తదితరులు పాల్గొన్నారు. logo