బుధవారం 08 జూలై 2020
Mancherial - May 29, 2020 , 02:24:34

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండండి

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండండి

 పకడ్బందీ కార్యాచరణతో ముందుకెళ్లాలి

 ఇంకుడు గుంతలు, వైకుంఠధామాలు త్వరగా పూర్తవ్వాలి

 కలెక్టర్‌ భారతీ హోళికేరి

 సీసీసీలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష

సీసీసీ నస్పూర్‌: వర్షాకాలంలో వచ్చే సీజనల్‌ వ్యాధుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ భారతీ హోళికేరి సూచించారు. సీసీసీ సింగరేణి అ తిథి గృహంలోని సమావేశ మందిరంలో గురువారం  జి ల్లా అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ట్రైనీ కలెక్టర్‌ కుమార్‌ దీ పక్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో సీజనల్‌ వ్యాధులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అన్ని శాఖల అధికారు లు సమన్వయంతో ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అం దించడానికి కృషి చేయాలని సూచించారు. గ్రామాలు, ప ట్టణ ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిల్వకుండా చూడాలని, మురుగు కాలువలు, చెత్తను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉం డే విధంగా చూడాలన్నారు. జిల్లాలో సీజనల్‌ వ్యాధులు అ ధికంగా ఉన్న దండేపల్లి మండలంలోని జైతుగూడ, బైరంగూడ, వేమనపల్లి మండలంలోని గొర్లపల్లి, కోటపల్లి మం డలంలోని పారుపల్లి, కాసిపేట మండలంలోని మామిడిగూడ, మోతుగూడ, కోమటిచేను గ్రామాలను కలుపుకుని మొత్తం 22 గ్రామాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తారని ఆమె వివరించారు. జూన్‌ 10వ తేదీలోగా ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు, 20వ తేదీలోగా డంపింగ్‌ యార్డులు, 30వ తేదీలోగా వైకుంఠధామాలు పూర్తి చేయా లని సూచించారు.  సీజనల్‌ వ్యాధులకు కోవిడ్‌-19 తోడ య్యే ప్రమాదం ఉందని, అధికారులు పకడ్బందీ ప్రణాళిక తో ముందుకెళ్లాలని సూచించారు. జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వర్‌, జిల్లా అరోగ్య శాఖ అధికారి నీరజ, పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య, గ్రామీణాభివృద్ధి అధికారి శేషాద్రి, ము ఖ్య ప్రణాళికాధికారి సత్యనారాయణరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్లు, తహసీల్దార్లు,  ఎంపీడీవోలు, ఎంపీవోలు, వై ద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. 


logo