గురువారం 22 అక్టోబర్ 2020
Mancherial - May 26, 2020 , 23:28:09

మిద్దెచింతకు బైక్‌పై నిర్మల్‌ ఎస్పీ

మిద్దెచింతకు బైక్‌పై నిర్మల్‌ ఎస్పీ

మావోయిస్టులకు సహకరించవద్దని గిరిజనులకు పిలుపు

కడెం మండలంలోని ఉడుంపూర్‌ పంచాయతీ పరిధి అటవీ ప్రాంత గ్రామాల్లో నిర్మల్‌ ఎస్పీ శశిధర్‌రాజు మంగళవారం పర్యటించారు. ఉడుంపూర్‌ నుంచి ఐదు కిలో మీటర్ల దూరంలోని మారుమూల గ్రామం మిద్దె చింతకు ఇలా గన్‌తో బైక్‌పై చేరుకున్నారు.   

 కడెం: మావోయిస్టులకు ఎవరూ సహకరించవద్దని, వారు గ్రామాలకు వస్తే వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని గిరిజనులకు జిల్లా ఎస్పీ శశిధర్‌రాజు పిలుపునిచ్చారు. మంగళవారం కడెం మండలంలోని ఉడుంపూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని మిద్దెచింత గ్రామాన్ని ఎస్పీ సందర్శించారు. గిరిజనులతో సమావేశం నిర్వహించారు. గ్రామంలోని సమస్యలను తెలుసుకొని, పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. మావోయిస్టుల మాటలు విని ఉజ్వల భవిష్యత్‌ను యువత నాశనం చేసుకోవద్దని సూచించారు. జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో జాబ్‌మేళాలు, స్వయం ఉపాధి రంగాల్లో శిక్షణనిస్తున్నామని తెలిపారు. వాటిని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  ఖానాపూర్‌ సీఐ జయరాం, కడెం ఎస్‌ఐ ప్రేమ్‌దీప్‌, కానిస్టేబుళ్లు, తదితరులున్నారు. 


logo