సోమవారం 13 జూలై 2020
Mancherial - May 24, 2020 , 23:48:38

యువతిని కాపాడిన పోలీసులు

యువతిని కాపాడిన పోలీసులు

ఇందారం వద్ద గోదావరిలో దూకి ఆత్మహత్నాయత్నం

 తాడు అందించి ఒడ్డుకు చేర్చిన కానిస్టేబుళ్లు

జైపూర్‌ : ఓ యువతి గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి కాపాడిన ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలం ఇందారం గోదావరి బ్రిడ్జి వద్ద చోటు చేసుకుంది. మందమర్రి మండలం గుడిపెల్లి గ్రామానికి చెందిన లింగంపల్లి వర్ణ ఆదివారం ఇంట్లో గొడవడింది. ఆదివారం సాయంత్రం ఇందారం గోదావరి బ్రిడ్జి వద్దకు చేరుకొని నీటిలో దూకింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న హెడ్‌కానిస్టేబుల్‌ రవీందర్‌, కానిస్టేబుళ్లు దేవన్న, రవి, ఎస్‌అండ్‌పీసీ ఓదెలు వెంటనే అక్కడికి చేరుకొని ఆమెకు తాడు అందించారు. ఆ యువతి తాడును పట్టుకొని ఉం డగా, సిబ్బంది నీటిలోకి దిగి ఆ యువతిని బయటకు తీసుకొచ్చారు. అనంతరం ఆ యువతికి కౌన్సెలింగ్‌ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. యువతి ప్రాణాలు కాపాడిన సిబ్బందిని శ్రీరాంపూర్‌ సీఐ కోటేశ్వర్‌, ఎస్‌ఐ విజేందర్‌ అభినందించారు.


logo