మంగళవారం 26 మే 2020
Mancherial - May 24, 2020 , 00:10:15

కరోనాను కలిసికట్టుగా నియంత్రిద్దాం

కరోనాను కలిసికట్టుగా నియంత్రిద్దాం

 వానకాలంలో ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచాలి

 ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి

మంచిర్యాల కలెక్టర్‌ భారతీ హోళికేరి

 బాబానగర్‌లో సరుకులు పంపిణీ

 నర్సరీ నిర్వహణపై సంతృప్తి

మంచిర్యాల రూరల్‌ (హాజీపూర్‌) : కరోనా వైరస్‌ను కలిసికట్టుగా నియంత్రిద్దామని ప్రజ లు, అధికారులకు  మంచిర్యాల కలెక్టర్‌ భారతీ హోళికేరి పిలుపునిచ్చారు. తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం (టీజీవో) ఆధ్వర్వంలో శనివారం హాజీపూర్‌ మండలం గడ్‌పూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని బాబానగర్‌ గిరిజనులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్‌ మాట్లాడారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అనేక మం ది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సమస్యను గుర్తించిన ప్రభుత్వం పేదలతో పాటు వలస కూలీలను అన్ని రకాలుగా ఆదుకుంటున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వంతో పాటు అనేక స్వచ్ఛంద సంస్థలు సైతం తమ వంతు సాయం చేస్తున్నాయన్నారు. ఇక్కడ 100 మంది గిరిజనులకు 15 రోజులకు సరిపడా సరుకులు అందిచడం అభినందనీయమని పేర్కొన్నారు. రానున్నది వర్షాకాలం కావడంతో గ్రామాలు, నివాస ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉం దన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, పర్యావరణాన్ని కాపాడాలని గుర్తు చేశారు. ఆ తరువాత గ్రామంలో ఈజీఎస్‌ ఆధ్వర్వంలో ఏర్పా టు చేసిన నర్సరీని పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గడ్‌పూర్‌ సర్పంచ్‌ లక్ష్మి, తెలంగాణ గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం జిల్లా వ ర్కింగ్‌ ప్రెసిడెంట్‌, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, అధ్యక్షుడు శ్రీనివాస్‌, ఉపాధ్యక్షులు జమీర్‌(హాజీపూర్‌ తహసీల్దార్‌), శ్రీపతి బాపురావు (భీమారం మండల పంచాయతీ అ ధికారి), సంయుక్త కార్యదర్శి అబ్దుల్‌ హై(హాజీపూర్‌ ఎంపీడీవో), అసోసియేట్‌ అధ్యక్షుడు  వీరయ్య(వ్యవసాయ శాఖ అధికారి), జాయింట్‌ సెక్రటరీ బాలాజీ, కోశాధికారి సుధాకర్‌, జిల్లా సంక్షేమ శాఖ అధికారి రవూఫ్‌ ఖాన్‌, జడ్పీసీఈవో నరేందర్‌, జడ్పీటీసీ అనుబా, మండల కో ఆప్షన్‌ సభ్యుడు రఫీక్‌, మంచిర్యాల సీఐ ముత్తి లింగయ్య, ఎస్‌ఐ మారుతితో పాటు  వార్డు సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.


logo