మంగళవారం 26 మే 2020
Mancherial - May 23, 2020 , 02:02:32

సందడే.. సందడి..

సందడే.. సందడి..

 ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మార్కెట్‌ కళకళ

 సరి-బేసి విధానంలో తెరుచుకున్న దుకాణాలు

 జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదమంటున్న నిపుణులు 

కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ నేపథ్యంలో దుకాణాలు మూతపడ్డాయి. దాదాపు రెండు నెలల తర్వాత మళ్లీ కళకళలాడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపు ఇవ్వడంతో సరి-బేసి విధానంలో తెరుచుకొని మార్కెట్లు సందడిగా మారాయి. భౌతిక దూరం పాటించాలని, ముఖాలకు మాస్కులు, చేతులకు గ్లౌజులు  తప్పకుండా ధరించాలని సర్కారు నిబంధన విధించింది. దుకాణాదారులు నిబంధనలు పాటిస్తూ ఓపెన్‌ చేశారు. దుకాణంలో రెయిలింగ్‌లు, ఫ్లోరింగ్‌, బట్టలకు శానిటైజేషన్‌ చేశారు. అయినప్పటికీ ప్రజలు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. 

- మంచిర్యాల/ఆదిలాబాద్‌, ఫొటో గ్రాఫర్స్‌


logo