శనివారం 06 జూన్ 2020
Mancherial - May 23, 2020 , 02:02:29

మలేరియాపై ముందస్తు యుద్ధం

మలేరియాపై ముందస్తు యుద్ధం

 ప్రభావిత గ్రామాలపై ప్రత్యేక దృష్టి

 నివారణకు వైద్య, ఆరోగ్యశాఖ ప్రణాళిక

 ఐదు పీహెచ్‌సీల పరిధిలో  79 గ్రామాల్లో ఐఆర్‌ఎస్‌

 రెండు విడుతల్లో నిర్వహణకు చర్యలు

వానకాలంలో ప్రబలే మలేరియా మహమ్మారిని తరిమేందుకు వైద్య, ఆరోగ్యశాఖ ముందస్తు సమరానికి సన్నద్ధమైంది. జిల్లాలోని ఐదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 79 ప్రభావిత గ్రామాలను గుర్తించింది. దోమల నివారణకు ఆయా గ్రామాల్లో రెండు విడుతల్లో ఐఆర్‌ఎస్‌ (ఇండోర్‌ రెసిడ్యూయెల్‌ స్ప్రే) చేసేందుకు చర్యలు చేపడుతున్నది. మరోవైపు దవాఖానల్లో సౌకర్యాలను అందుబాటులో ఉంచి, వైద్య సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నది.

- కుమ్రం భీం ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ

కుమ్రం భీం ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ : జిల్లాలో అత్యధికంగా మారుమూల గిరిజన గ్రామాలే ఉన్నాయి. వానకాలంలో మలేరియా.. తదితర వ్యాధులు ప్రబలే ఆస్కారముంటుంది. దీంతో వైద్య, ఆరోగ్యశాఖ ముందస్తు చర్యలకు సన్నద్ధమవుతున్నది. జిల్లా వ్యాప్తంగా 79 మలేరియా ప్రభావిత గ్రామాలను గుర్తించారు. అడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 10 గ్రామా లు, కెరమెరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 12, సిర్పూర్‌-యు పీహెచ్‌సీ పరిధిలో 29, పెంచికల్‌పేట్‌ పీహెచ్‌సీ పరిధిలో 10, రోంపల్లి పీహెచ్‌సీ పరిధిలో 18 గ్రామాలు ఉన్నా యి. ఈ వానకాలంలో ఆయా గ్రామాల్లో రెండు విడుతలుగా ఐఆర్‌ఎస్‌ (ఇండోర్‌ రెసిడ్యూయెల్‌ స్ప్రే) నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పీహెచ్‌సీల్లో పూర్తిస్థాయిలో సౌకర్యాలు అందుబాటులో ఉంచారు. కాగా, ఇటీవల ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పరిశుభ్రంగా మారినప్పటికీ అధికారులు అప్రమత్తమై ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.

అప్రమత్తంగా ఉన్నాం

వానకాలంలో వ్యాధులు ప్రబలకుం డా అన్ని రకాల చర్య లు తీసుకుంటున్నాం. ముఖ్యం గా మలేరియాను అరికట్టేందు కు కృషి చేస్తు న్నాం. జిల్లాలోని ఐదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 79 ప్రభావిత గ్రామాలను గుర్తించాం. రెండు విడుతల్లో ఐఆర్‌ఎస్‌ కార్యక్రమాలను నిర్వహిస్తాం. 

- కుమ్రం బాలు, జిల్లా, వైద్య ఆరోగ్యశాఖ అధికారి


logo