శనివారం 06 జూన్ 2020
Mancherial - May 22, 2020 , 00:05:47

అభినయంలో సావిత్రి.. ఈ యశస్విని

అభినయంలో సావిత్రి.. ఈ యశస్విని

నృత్యంతో పాటు నటనలోనూ రాణిస్తున్న విద్యార్థిని

బెల్లంపల్లి రూరల్‌ : బెల్లంపల్లిలోని బాలుర గురుకుల కళాశాల (సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ) ప్రిన్సిపాల్‌ ఐనాల సైదులు కుమార్తె సౌగంధి యశస్వినికి చిన్నతనం నుంచే డ్యాన్స్‌పై ఆసక్తి. ఎవరి వద్ద శిక్షణ తీసుకోకుండానే పట్టుదలతో నేర్చుకుంది. ఎల్‌కేజీ స్థాయి నుంచి సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బెల్లంపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నది. నృత్యంతో పాటు నటనలోనూ ప్రతిభ చూపుతున్నది. జిల్లా, రాష్ట్ర స్థాయి లో అనేక బహుమతులు సాధించి ప్రశంస లు అందుకుంటున్నది. అభినయంలో సినీనటి సావిత్రిని తలపిస్తూ జూనియర్‌ సావిత్రిగా ప్రశంసలందుకుంటున్నది. పలు ఉపన్యాస పోటీల్లో తెలుగు, ఆంగ్ల్ల భాషల్లో అనర్గళంగా మాట్లాడి బహుమతులు అందుకున్నది. జిల్లా స్థాయి సైన్స్‌ఫేర్‌లో గణిత న మూనాలపై చక్కటి ప్రదర్శన ఇచ్చి మన్ననలను పొందింది. సామాజిక, చైతన్య కార్యక్రమాల్లో పాల్గొంటూ తండ్రికి తగ్గ తనయగా గుర్తింపు పొందుతున్నది.


logo