శనివారం 24 అక్టోబర్ 2020
Mancherial - May 21, 2020 , 23:34:17

రహదారి విస్తరణ త్వరగా పూర్తవ్వాలి

రహదారి విస్తరణ త్వరగా పూర్తవ్వాలి

 శరవేగంగా పనులు చేపట్టాలి

 ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌

 చెన్నూర్‌లో అధికారులు,  కాంట్రాక్టర్లతో సమీక్ష

చెన్నూర్‌/చెన్నూర్‌రూరల్‌ : పట్టణంలో ప్రధాన రహదారి విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ ఆదేశించారు. చెన్నూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రోడ్డు విస్తరణ పనులపై గురువారం మున్సిపల్‌ అధికారులు, కాంట్రాక్టర్‌తో సమీక్ష నిర్వహించా రు. రోడ్డు విస్తరణ పనులకు సంబంధించిన వివరాలను అధికారులు, కాంట్రాక్టర్‌ను అడిగితెలుసుకున్నారు. నిర్దేశించిన గడువులోగా శరవేగంగా పనులు పూర్తి చేయాలని సూచించారు. రోడ్డు పనుల్లో ఏమైనా ఇబ్బందులుంటే తమ దృష్టికి తీసుకు రావాలని పేర్కొన్నారు. పెద్ద చెరువు మినీ ట్యాంకు బండ్‌ నిర్మాణం పనులను విప్‌ సుమన్‌ పరిశీలించారు. మున్సిపల్‌ కమిషనర్‌ బాపు, ఇం జినీరింగ్‌ అధికారులు, కౌన్సిలర్లు రేవెల్లి మహే శ్‌, జగన్నాధుల శ్రీనివాస్‌, చెన్నూర్‌, కోటపల్లి వైస్‌ ఎంపీపీలు వెన్నపురెడ్డి బాపురెడ్డి, వాల శ్రీనివాసరావు, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మల్లెల దామోదర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు రాంలాల్‌ గిల్డా, జాడి తిరుపతి, నాయిని సతీశ్‌ పాల్గొన్నారు. కాగా చెన్నూర్‌ మండలం అంగ్రాజ్‌పల్లి వద్ద రోడ్డు నిర్మాణ పనులను విప్‌ సుమన్‌ ప్రారంభించారు. ఎంపీపీ మంత్రి బాపు, జడ్పీటీసీ మోతె తిరుపతి సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్నారు.

బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ

మందమర్రి : మార్కెట్‌లో వర్తక వ్యాపార సం ఘం ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 150 మంది నిరుపేద కుటుబాలకు బియ్యం, నిత్యావసర సరుకులను ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ పంపిణీ చేశారు. సింగరేణి పాఠశాల మైదానంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మరో 150 మం ది ప్రజలకు నిత్యావసర సరుకులను అందించా రు. ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మంచిర్యాల జడ్పీ అధ్యక్షురాలు నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ విప్‌ నల్లాల ఓదెలు, టీబీజీకేఎస్‌ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్‌ పాల్గొన్నారు.  


logo