బుధవారం 21 అక్టోబర్ 2020
Mancherial - May 20, 2020 , 23:24:26

వ్యవసాయ రుణాలపై నివేదికలివ్వాలి

వ్యవసాయ రుణాలపై నివేదికలివ్వాలి

  • రైతుల ఖాతాలకు ఆధార్‌  అనుసంధానం తప్పనిసరి
  • మంచిర్యాల కలెక్టర్‌ భారతీ హోళికేరి
  • బ్యాంకు, వ్యవసాయ శాఖాధికారులతో సమీక్ష

మంచిర్యాల రూరల్‌ (హాజీపూర్‌) : జిల్లాలో వ్వవసాయ, బంగారు రుణాలకు సంబంధించిన పూర్తి వివరాలతో బ్యాంకర్లు నివేదికను తయారు చేసి అందించాలని జిల్లా కలెక్టర్‌ భారతి హోళికేరి ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలె క్టర్‌ చాంబర్‌లో లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ హవేలి రా జు, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి వివిధ బ్యాంకుల మేనేజర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ఈ నెల 13 నుంచి 16వ తేదీది వరకు ప్రభుత్వం రుణమాఫీ కోసం బ్యాంకుల వారీగా ఖాతాలలో నగదు జమ చేశామని పేర్కొన్నారు. బ్యాంకుల్లో రైతుల ఖాతా లకు ఆధార్‌ నంబర్‌ అనుసంధానం తప్పనిసరిగా చేయాలన్నారు. రూ. 25వేల రుణం వరకు తీసు కున్న 12,428 మందిలో ఇప్పటి వరకు 5,643 మంది రైతుల ఖాతాల్లో రూ.8 కోట్ల 75 లక్షలు రుణమాఫీ కింద జమచేశామని చెప్పారు. మిగిలి న వారి బ్యాంకుల వారీగా ఖాతాలను పరిశీలించి, ఏమైనా తప్పులుంటే సవరించి సకాలంలో బ్యాం కు రుణమాఫీ వర్తించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. బ్యాంకుల వారీగా రూ. 25 వేల వరకు రుణాలు పొందిన, రుణమాఫీ పొందని వారి వివరాలతో నివేదికను తయారు చేసి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.logo