బుధవారం 28 అక్టోబర్ 2020
Mancherial - May 15, 2020 , 01:56:44

ఆపన్నులకు ఆసరాగా..

ఆపన్నులకు ఆసరాగా..

 • నిరుపేదలు, వలసకూలీలకు అండగా దాతలు
 • నిత్యావసర సరుకులు, బియ్యం అందజేత  

లాక్‌డౌన్‌ వేళ ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న నిరుపేదలు, వలసకూలీలకు దాతలు అండగా నిలుస్తున్నారు. నిత్యావసర సరుకులు, బియ్యం, కూరగాయల పంపిణీతో పాటు అన్నదానం చేస్తున్నారు.  తమకు తోచిన కాడికి సాయం అందిస్తూ ఉదారతను చాటుకుంటున్నారు. 

మంచిర్యాల టౌన్‌ : మంచిర్యాల ఐబీ ఏరియాలోని 100 మంది ఆటోడ్రైవర్లకు నిత్యావసర సరుకులను పాస్టర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ముఖేశ్‌గౌడ్‌, కౌన్సిలర్లు సుదమల్ల హరికృష్ణ , బోరిగం శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

 • చెన్నూర్‌ : ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌ కుమార్‌ తన సొంత ఖర్చులతో పట్టణంలోని పలువురికి బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. చెన్నూర్‌లో వేర్వేరుగా నిర్వహించిన కార్యక్రమాల్లో 50 మంది రజకులు, 90 మంది ముస్లింలు, 40 మంది ప్రైవేట్‌ పాఠశాలల ఉపాధ్యాయులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ అధ్యక్షురాలు అర్చన గిల్డా, వైస్‌ చైర్మన్‌ నవాజొద్దీన్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు రాంలాల్‌ గిల్డా, నాయిని సతీశ్‌, మేడు సురేశ్‌రెడ్డి పాల్గొన్నారు.
 • బెల్లంపల్లి రూరల్‌ : పట్టణంలోని 50 మంది పాత్రికేయులకు ఎమ్మెల్యే చిన్నయ్య క్యాంపు కార్యాలయంలో ఒక్కొక్క రికి 25 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. బెల్లంపల్లి మున్సిపల్‌ అధ్యక్షురాలు శ్వేత, వైస్‌ చైర్మన్‌ సుదర్శన్‌, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు భీమాగౌడ్‌, ఏసీపీ రహెమాన్‌, సీఐలు రాజు, జగదీశ్‌ ఉన్నారు.
 • చెన్నూర్‌ రూరల్‌ : డీటీఎఫ్‌ ఆధ్వర్యంలో మండలంలోని వస్తాదుపల్లిలో 44 పేద గిరిజన కుటుంబాలకు 12 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఐ సంజీవ్‌, సర్పంచ్‌ మౌనిక, డీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు పుప్పాల సంతోష్‌, ప్రధాన కార్యదర్శి జయకృష్ణ, నల్లగుంట అశోక్‌ ఉన్నారు. కరీంనగర్‌కు చెందిన ప్రతిమ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మండలంలోని సంకా రం గ్రామంలో మాస్కులు పంపిణీ చేశారు. కార్యక్రమం లో సర్పంచ్‌ పున్నం, కార్యదర్శి చంద్రశేఖర్‌ ఉన్నారు.
 • రామకృష్ణాపూర్‌ : క్యాతనపల్లి మున్సిపల్‌ రెండో వార్డు తిలక్‌నగర్‌లో కౌన్సిలర్‌ పుల్లూరి సుధాకర్‌ ఆధ్వర్యంలో 60 నిరుపేద కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకు లు, కూరగాయలు వితరణ చేశారు. మందమర్రి జడ్పీటీసీ వేల్పుల రవి, క్యాతనపల్లి మున్సిపల్‌ అధ్యక్షురాలు జంగం కళ, వైస్‌ చైర్మన్‌ ఎర్రం విద్యాసాగర్‌రెడ్డి, టీబీజీకేఎస్‌ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్‌, పట్టణ ఎస్‌ఐ రవిప్రసాద్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు నర్సింగా రావు, అబ్దుల్‌ అజీజ్‌ పంపిణీ చేశారు.  
 • నెన్నెల : మండలంలోని గొల్లపల్లిలో ఉపాధి హామీ కూలీలకు ప్రతిమ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 600 మాస్కులు, అం బలి పంపిణీ చేశారు. కోటి మాస్కుల పంపిణీలో భాగం గా ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఫౌండేషన్‌ నిర్వాహకులు తెలిపారు. నాయకులు పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ ఇందూ రి రమేశ్‌, ఉప సర్పంచ్‌ నారాయణ అందించిన వారిలో ఉన్నారు. చిత్తాపూర్‌లో సర్పంచ్‌ బత్తిని పద్మ పని స్థలాలకు వెళ్లి ఉపాధి కూలీలకు అంబలి అందించారు.
 • జైపూర్‌ : మండలంలోని శెట్‌పల్లిలో ఉపాధి హామీ కూలీలకు జడ్పీటీసీ మేడి సునీత మాస్కులు అందించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మేడి రవి, ఎంపీడీవో నాగేశ్వర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి రాజేశ్‌ పాల్గొన్నారు.
 • జన్నారం : మండలంలోని పైడిపెల్లిలో 2001-2002 సంవత్సరం పదో తరగతి బ్యాచ్‌ విద్యార్థులు అందించిన నిత్యావసరాలను 50 గిరిజన కుటుంబాలకు తహసీల్దార్‌ రాజ్‌కుమార్‌ పంపిణీ చేశారు. కార్యక్రమంలో కిరణ్‌, లక్ష్మణ్‌, రాము, శేఖర్‌ పాల్గొన్నారు.
 • తాండూర్‌ : మాదారం అటవీ ప్రాంతంలో ఉపాధి పనులు చేస్తున్న 50 మంది కూలీలకు ఎంపీటీసీ సూరం రవీందర్‌రెడ్డి మాస్కులు పంపిణీ చేశారు.
 • ఆసిఫాబాద్‌ : సాలేగూడ, భాగ్యనగర్‌కాలనీల్లో 400 పేద కుటుంబాలకు ఆసిఫాబాద్‌ జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు కూరగాయలు పంపిణీ చేశా రు. సర్పంచ్‌ తులసమ్మ, ఎంపీటీసీ రవీందర్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మల్లేశ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చిలువేరు వెంకన్న పాల్గొన్నారు.
 • రెబ్బెన : మండల కేంద్రంలోని బ్యాంకులు, దవాఖాన, మా ర్కెట్‌కు వచ్చిన వారికి ఇందిరానగర్‌ కనకదుర్గాదేవి ఆలయ అర్చకుడు దేవర వినోద్‌ అంబలి అందించారు. గోలేటిలో అజయ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 20 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
 • తిర్యాణి : భీంజిగూడ, పంగిడిమాదర, చింతలమాదర, మందగూడ, కైరిగూడ, గిన్నేధరి, గుడిపేట్‌, సుంగాపూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని 24 గిరిజన గ్రామాల్లో 175 కుటుంబాలకు జై జంగుబాయి, గోండ్వాన యువజన సంఘం ఆధ్వర్యంలో యాక్షి స్వచ్ఛంద సంస్థ సహకారంతో నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. జంగుబాయి మహిళా సంఘం, గోండ్వాన యువజన సంఘం అధ్యక్షుడు ఆత్రం ఆనంద్‌, అధ్యక్షురాలు కమలాబాయి, సభ్యులు అన్నపూర్ణ, యమున, రాధ, భాగ్య పాల్గొన్నారు.
 • కెరమెరి : లక్మాపూర్‌ గ్రామానికి చెందిన గుగ్లావత్‌ బిక్కు నాలుగేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకోవడంతో అతని కుటుంబ సభ్యులకు మానవహక్కుల వేదిక జిల్లా అధ్యక్షుడు సుజాయిత్‌ఖాన్‌, సంగెపు బొర్రన్న, మాజీ మండల కో-ఆప్షన్‌ సభ్యుడు షేక్‌ ఖుత్బొద్దీన్‌ నిత్యావసర సరుకులు అందజేశారు.
 • కౌటాల : మండల కేంద్రంలోని బస్టాండ్‌ వద్ద కౌటాల సహాయ సంఘం ఆధ్వర్యంలో వలస కూలీలకు పులిహోర, అంబలి పంపిణీ చేశారు. 
 • బెజ్జూర్‌(పెంచికల్‌పేట) : ఎల్లూర్‌లో ఉపాధి కూలీలకు  ప్రతి మ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మాస్కులను అందజేశారు. కో-ఆప్షన్‌ సభ్యుడు సయ్యద్‌ సాజిద్‌, సర్పంచ్‌ దుర్గం రాజన్న, ఉప సర్పంచ్‌ కొయ్యడ అలివేణి ఉన్నారు.


logo