బుధవారం 28 అక్టోబర్ 2020
Mancherial - May 15, 2020 , 01:56:45

మన ఊరిని మనమే కాపాడుకోవాలి

మన ఊరిని మనమే కాపాడుకోవాలి

  • ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిపై నిఘా ఉంచాలి
  • రామగుండం సీపీ సత్యనారాయణ

జన్నారం : కరోనా వైరస్‌ వ్యాప్తి నుంచి ‘మన ఊరిని మనమే కాపాడుకోవాలి’ అని ప్రజాప్రతినిధులకు రామగుండం సీపీ సత్యనారాయణ పిలుపునిచ్చారు. గురువారం జన్నారంలోని పైడిపెల్లి ఫంక్షన్‌ హాల్‌లో కరోనా(కొవిడ్‌-19) వైరస్‌ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిని వెంటనే గుర్తించి, వారిని హోం క్వారంటైన్‌లో ఉండేలా సర్పంచ్‌లు, ఎంపీటీసీలు చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరైనా వినకపోతే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, వారిపై కేసులు నమోదుచేసి క్వారంటైన్‌కు పంపిస్తామని స్పష్టం చేశారు. ప్రజలు అనవసరంగా బయట తిరగొద్దని, మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. అంతకుముందు ఖానాపూర్‌ ఎమ్యెల్యే రేఖానాయక్‌ మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్‌, ఎంపీపీ మాదాడి సరోజన, కో-ఆప్షన్‌ సభ్యుడు మున్వర్‌ అలీఖాన్‌, భరత్‌కుమార్‌, జక్కు భూమేశ్‌ పాల్గొన్నారు.logo