శుక్రవారం 30 అక్టోబర్ 2020
Mancherial - May 13, 2020 , 02:58:12

ఘనంగా నర్సుల దినోత్సవం

ఘనంగా నర్సుల దినోత్సవం

మంచిర్యాల అగ్రికల్చర్‌/లక్షెట్టిపేట/మంచిర్యాల రూరల్‌ (హాజీపూర్‌)/రామకృష్ణాపూర్‌/భీమారం:మంచిర్యాల జిల్లా దవాఖానలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలోని బ్లడ్‌ బ్యాంకులో సేవలందిస్తున్న సిబ్బందిని శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో ఐఆర్‌సీఎస్‌ సభ్యులు మధుసూదన్‌రెడ్డి, డాక్టర్‌ విష్ణుమూర్తి, రాజేశ్‌ పాల్గొన్నారు. జిల్లా దవాఖానలోని నర్సులను మంచిర్యాల మహిళా తరంగిణి(మమత) సొసైటీ ఆధ్వర్వంలో సన్మానించారు. కార్యక్రమంలో జ్యోత్స్న, చంద్రదత్త, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. లక్షెట్టిపేటలోని ప్రభుత్వ దవాఖానలో కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో సురేశ్‌, అఫ్రీన్‌, శ్రీవాణి, కన్యాకుమారి, పవన్‌ పాల్గొన్నారు. టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో రామకృష్ణాపూర్‌లోని సింగరేణి ఏరియా వైద్యశాలలో నిర్వహించిన కార్యక్రమంలో డీవైసీఎంవో ఉష, నర్సులతో కలిసి కేక్‌కట్‌ చేశారు. ఆ తర్వాత ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మేట్రన్‌ పుష్ప, స్టాఫ్‌నర్సులు, టీబీజీకేఎస్‌ పిట్‌ కార్యదర్శి ముద్దసాని కృష్ణ, నక్క సురేశ్‌ బాబు, మేకల రాజయ్య, నరేందర్‌, విమలాకుమారి పాల్గొన్నారు. అభయరామన్‌ సొసైటీ ఆధ్వర్యంలో భీమారం పంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలను శాలువాలతో సన్మానించారు. ఎంపీడీవో శ్రీనివాస్‌, ఎంపీవో శ్రీపతి బాపు, సర్పంచ్‌ గద్దె రాంరెడ్డి, సొసైటీ సభ్యుడు భూపెల్లి లక్ష్మణ్‌ పాల్గొన్నారు.