గురువారం 22 అక్టోబర్ 2020
Mancherial - May 12, 2020 , 01:41:15

ఎస్పీఎంలో గ్యాస్‌ లీక్‌

ఎస్పీఎంలో గ్యాస్‌ లీక్‌

  • ఒకరికి అస్వస్థత.. దవాఖానకు తరలింపు
  • విచారణ చేపట్టిన అధికారులు
  • ప్రమాదమేమీ లేదన్న యాజమాన్యం

కాగజ్‌నగర్‌ టౌన్‌ : పట్టణంలోని సిర్పూర్‌ పేపర్‌ మిల్లు(ఎస్పీఎం)లో సోమవారం ఉదయం గ్యాస్‌ లీక్‌ అవడంతో కార్మికుడు అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. ఉదయం 6 గంటలకు మొదటి షిప్టులో ఫినిషింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసేందుకు 55 మంది కాంట్రాక్ట్‌ కార్మికులు వచ్చారు. సుమారు 8 గంటల ప్రాంతంలో ఫైబర్‌లైన్‌ వద్ద ఉన్న హెచ్‌సీఎల్‌, సీఎల్‌వో-2 ప్లాంట్‌ వద్ద లిక్విడ్‌ గ్యాస్‌ లీకై చిన్న నాలా గుండా పేపర్‌ ఫినిషింగ్‌ డిపార్ట్‌మెంట్‌ దాకా చేరుకుంది. ఏదో వాసన వస్తుందని భయపడి 16 మంది కార్మికులు ఇళ్లకు వెళ్లారు. వీరిలో నౌగాంబస్తీకి చెందిన నాగుల రాజంకు శ్వాస ఆడక కడుపు ఉబ్బింది.  విరేచనాలు కావడంతో ప్రైవేట్‌ దవాఖానకు తరలించారు. కాగజ్‌నగర్‌ ఇన్‌చార్జి తహసీల్దార్‌ లింగమూర్తి, ఇన్‌చార్జి ఎంపీడీవో శ్రీనివాస్‌, జిల్లా పరిశ్రమల ప్రమోషన్‌ అధికారి అశోక్‌, ఆర్‌ఐ అశోక్‌తో కలిసి మిల్లులో విచారణ చేపట్టారు. ఆ తర్వాత రాజం వద్దకు వెళ్లి వాంగ్మూలం తీసుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు. హెచ్‌సీఎల్‌ గ్యాస్‌ పైపులైన్‌ బోల్ట్‌ ఊడిపోవడంతో కొంత గ్యాస్‌ లీకైందని వైస్‌ ప్రెసిడెంట్‌ వర్క్స్‌ మయాంక్‌ జిందాల్‌ వెల్లడించారు. దీనివల్ల పెద్దగా ప్రమాదమేమీ ఉండదని చెప్పారు.logo