శుక్రవారం 30 అక్టోబర్ 2020
Mancherial - May 12, 2020 , 01:41:16

రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌

రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌

  • ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎమ్మెల్యే దివాకర్‌రావు
  • ఆయిల్‌ పాం సాగు నిర్ణయంపై హర్షం
  • సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ చిత్రపటాలకు పాలాభిషేకం

మందమర్రి/చెన్నూర్‌/మంచిర్యాల టౌన్‌/మంచిర్యాల అగ్రికల్చర్‌/నెన్నెల : తెలంగాణలో వ్యవసాయరంగ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్న సీఎం కేసీఆర్‌ రైతు బాం ధవుడని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, మంచి ర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు కొనియాడారు. రాష్ట్రంలో 5 లక్షల నుంచి 10 లక్షల ఎకరాల వరకు ఆయిల్‌ పాం సాగు చేయాలని సర్కారు నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తంచేశారు. ఈమేరకు మందమర్రి టీఆర్‌ఎస్‌ కార్యాలయం వద్ద సోమవారం సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి విప్‌ సుమన్‌ పాలాభిషేకం చేయగా జ డ్పీ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, జడ్పీటీసీ రవి, ఎంపీపీ మంగ, టీబీజీకేఎస్‌ ఏరియా ఉపాధ్యక్షుడు సంపత్‌, టీఆర్‌ఎస్‌ నేత రవీందర్‌ పాల్గొన్నారు. అలాగే చెన్నూ ర్‌ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ చిత్రపటాలకు టీఆర్‌ఎస్‌ నాయకులు పాలాభిషేకం చేశారు. ఎంపీపీ మంత్రి బాపు, కోటపల్లి వైస్‌ ఎంపీపీ వాల శ్రీనివాసరావు, జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు అజ్గర్‌, చెన్నూర్‌, కోటపల్లి మండలాల టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు దామోదర్‌రెడ్డి, ప్రభాకర్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నవాజొద్దీన్‌, సింగిల్‌ విండో చైర్మన్లు రాంరెడ్డి, సాంబాగౌడ్‌ పాల్గొన్నారు. ఆయిల్‌పాం సాగుకు ప్రోత్సాహంతో పాటు రైతులకు రూ. 25 వేల లోపు రుణమాఫీపై తీసుకున్న నిర్ణయంపై మంచిర్యాలలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి ఎమ్మెల్యే దివాకర్‌రావు పాలాభిషేకం చేశారు. మున్సిపల్‌ చైర్మన్‌ రాజయ్య, వైస్‌ చైర్మన్‌ ముఖేశ్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు గాదె సత్యం, అత్తి సరోజ, సురేశ్‌ బల్దవా, రవీందర్‌రెడ్డి, పల్లె భూమేశ్‌, వెంకటేశ్‌, ఎర్రం తిరుపతి, గొంగళ్ల శం కర్‌ పాల్గొన్నారు. అలాగే నెన్నెల మండల కేంద్రంలో ఎంపీపీ రమాదేవి, నాయకులు సాగర్‌, మల్లేశ్‌, రాజు సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మీ సేవ ఆపరేటర్లకు రూ.5200 రెన్యూవల్‌ ఫీజు రద్దు చేయడంపై సీఎం కేసీఆర్‌, ఐటీ మంత్రి కేటీఆర్‌కు అసోసియేషన్‌ నాయకులు దత్తాత్రేయ, మహే శ్‌ కృతజ్ఞతలు తెలిపారు. రూ.12 వేల వడ్డీలేని రుణం మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.