శనివారం 24 అక్టోబర్ 2020
Mancherial - May 11, 2020 , 02:51:43

జనావాసాల్లోకి చుక్కల దుప్పి

జనావాసాల్లోకి చుక్కల దుప్పి

మంచిర్యాల రూరల్‌ (హాజీపూర్‌): అడవిలో నుంచి జనావాసాల్లోకి ఓ చుక్కల దుప్పి ఆదివారం వచ్చింది. బొక్కలగుట్ట అటవీ ప్రాంతం నుంచి మంచిర్యాల పట్టణ శివారులోని రాళ్ల వాగులో నీరు తాగుతుండగా..  ఊర కుక్కలు వెంటపడ్డాయి. ఎంసీసీ ప్రాంతంలోని సిరామిక్స్‌ కంపెనీ వద్దకు చేరుకోగానే.. యువకులు గమనించి కుక్కలను తరమికొట్టారు. గాయపడిన దుప్పికి చికిత్స చేయించారు. అనంతరం లక్షెట్టిపేట ఫారెస్ట్‌ రేంజర్‌ నాగవత్‌ స్వామికి సమాచారం అందించారు. ఆయన వెంటనే సంబంధిత బీట్‌ అధికారిని అక్కడికి పంపించారు. గాయపడిన దుప్పిని స్వాధీనం చేసుకొని అటవీ ప్రాంతంలో వదిలినట్లు అధికారులు తెలిపారు.


logo