గురువారం 29 అక్టోబర్ 2020
Mancherial - May 11, 2020 , 02:51:44

పేదల సేవకు కదిలి..

పేదల సేవకు కదిలి..

  • అభాగ్యులకు అండగా దాతలు
  • నిత్యావసర సరుకులు పంపిణీ

లాక్‌డౌన్‌ నేపథ్యంలో అభాగ్యులకు, నిరుపేదలకు స్వచ్ఛంద సంస్థల సభ్యులు, దాతలు ఆపన్న హస్తం అందిస్తూ అండగా నిలుస్తున్నారు.. ఆహారం, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ భరోసా కల్పిస్తున్నారు.

తాండూర్‌ : అభినవ సంస్థ అధ్యక్షుడు సంతోష్‌కుమార్‌ అం దించిన పులిహోర ప్యాకెట్లను 265 మంది పాదచారులు, వలసకూలీలకు ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి అందించారు. ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో కిష్టంపేట, రాజీవ్‌నగర్‌, తాండూర్‌లో పనిచేస్తున్న 20 మంది పారిశుధ్య కార్మికులకు బియ్యం, నిత్యావసరాలు సర్పంచ్‌ అంజిబాబు, ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి పంపిణీ చేశారు.

లక్షెట్టిపేట : పట్టణంలోని మహారాజుల కాలనీలో 70 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను మాదిగ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ గొడిసెల లక్ష్మి, ఉద్యోగులు వడ్లూరి రాజేశ్‌, వేల్పుల అర్జున్‌, రవి, జూల అంజన్న, శ్రీనివాస్‌, కూడెల్లి భీమేశ్‌, వేల్పుల కిరణ్‌, అశోక్‌ పాల్గొన్నారు.

దండేపల్లి : మేదరిపేటలోని కాకతీయ జూనియర్‌, డిగ్రీ కళాశాల యాజమాన్యం ఇచ్చిన నిత్యావసరాలను నిరుపేదలకు ఎస్‌ఐ శ్రీకాంత్‌ అందించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ హన్మయ్య, అధ్యాపకులు మధుసూదన్‌, సత్యం పాల్గొన్నారు.

సీసీసీ నస్పూర్‌ : టీబీజీకేఎస్‌ నాయకుడు సురేందర్‌రెడ్డి మనవడు అంకిత్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కు టుంబ సభ్యులతో కలిసి గోదావరికాలనీ షిర్కెలో 400 మంది పేదలకు అన్నం ప్యాకెట్లు పంపిణీ చేశా రు. కార్యక్రమంలో నడిపెల్లి ట్రస్ట్‌ చైర్మన్‌ విజిత్‌రావు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ తోట శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వంగ తిరుపతి, కోటపల్లి ఎంపీపీ మంత్రి సురేఖ ఉన్నారు. నస్పూర్‌ నాగార్జునకాలనీలో 60 మంది ఆటోడ్రైవర్లకు నిత్యావసర సరుకులను మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ తోట శ్రీనివాస్‌ పంపిణీ చేశారు. కార్యక్రమంలో వెంగల కుమారస్వామి, నీలం సదయ్య, తోట రాములు పాల్గొన్నారు.

శ్రీరాంపూర్‌ : శ్రీరాంపూర్‌ ఆర్కే-6 గుడిసెల్లోని 60 మంది నిరుపేదలకు కాకా ఫౌండేషన్‌ ఇచ్చిన బియ్యం, నిత్యావసరాలను ఎస్‌ఐ మంగీలాల్‌ పంపిణీ చేశాచారు. కార్యక్రమంలో బరపాటి మారుతి, కొండ వెంకటేశ్‌, జంగంపెల్లి మహేశ్‌, చిందం సందీప్‌, బీ శ్రీనివాస్‌, రాజు పాల్గొన్నారు. 

మంచిర్యాలటౌన్‌ : గీతా అధ్యయన మండలి ఇచ్చిన నిత్యావసర సరుకులను గోసేవా మండలి ప్రాం తంలోని 275 మంది నిరుపేదలకు 31వ వార్డు కౌన్సిలర్‌ సురేశ్‌ బల్దవా అందించారు. నడిపెల్లి చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ‘దివాకరన్న పెరుగన్నం’ కార్యక్రమాన్ని ఐబీలో నిర్వహించారు. ఓవర్‌బ్రిడ్జి వద్ద కౌన్సిలర్లు గాదె సత్యం, ప్రభాకర్‌నాయక్‌ నిత్యాన్నదానాన్ని కొనసాగించారు. ఐదోవార్డు సాయికుంటలో ఆవునూరి సుధాకర్‌ జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు వెంకటేశ్‌, రవి చేపట్టిన అన్నదానాన్ని కౌన్సిలర్‌ హరికృష్ణ ప్రారంభించారు. 

రెబ్బెన : లేతన్‌గూడ రైల్వేగేట్‌ పనులు చేస్తున్న  వలస కూలీలకు, గొల్లగూడ గ్రామానికి చెందిన 45 నిరుపేద కుటుంబాలకు ఇందిరానగర్‌ కనకదుర్గాదేవి ఆలయ అర్చకుడు దేవర వినోద్‌ నిత్యావసర సరుకులు అందజేశారు. పులికుంట గ్రామంలో అజయ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సర్పంచ్‌ బుర్స పోషమల్లు వలస కూలీలకు, గోలేటి అంబేద్కర్‌నగర్‌లో 30 పేద కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.

కౌటాల : కౌటాల మీదుగా మహారాష్ట్రకు కాలినడకన వెళ్తున్న 150 మంది వలస కూలీలకు స్థానిక బస్టాండ్‌ వద్ద కౌటాల సహాయ సంఘం ఆధ్వర్యంలో పులిహోర, అంబలి పంపిణీ చేశారు. కార్యక్రమంలో సం ఘం సభ్యులు వినోద్‌ గౌడ్‌, ఉమాపతి, అశోక్‌, కిట్టు, మల్లయ్య, శ్రీనివాస్‌ ఉన్నారు.


logo