గురువారం 22 అక్టోబర్ 2020
Mancherial - May 10, 2020 , 02:39:17

నేడు ‘పరిశుభ్రత’లో పాల్గొనాలి

నేడు ‘పరిశుభ్రత’లో పాల్గొనాలి

బెల్లంపల్లి రూరల్‌ : మున్సిపల్‌ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం 10 గంటలకు పది నిమిషాలపాటు నిర్వహించే పరిశుభ్రత కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని బెల్లంపల్లి మున్సిపల్‌ కమిషనర్‌ ఆకుల వెంకటేశ్‌ శనివారం ఒక ప్రకటనలో కోరారు. వాడని ఫ్రిజ్‌లు, నీరు నిలిచిన కూలర్లు, తాగి పడేసిన కొబ్బరి బోండాలను పరిసరాలకు దూరంగా వేయాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి వార్డులో కౌన్సిలర్లు, నాయకులు దగ్గర ఉండి పరిశీలించాలన్నారు. దీంతో వర్షాకాలంలో దోమల, వ్యాధుల వ్యాప్తి అరికట్టవచ్చన్నారు.


logo