సోమవారం 19 అక్టోబర్ 2020
Mancherial - May 09, 2020 , 02:18:42

ఆదరిస్తూ.. అండగా నిలుస్తూ..

ఆదరిస్తూ.. అండగా నిలుస్తూ..

  • నిరుపేదలు, వలస జీవులకు దాతల చేయూత
  • అన్నదానం, నిత్యావసర సరుకుల పంపిణీ.

లాక్‌డౌన్‌ కాలంలో ఉపాధి కోల్పోయిన వలస జీవులు, నిరుపేదలకు పలువురు దాతలు అండగా నిలుస్తున్నారు. తోచినంత ఆర్థిక సాయమందించడంతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. రోడ్లవెంట స్వస్థలాలకు కాలినడకన వెళ్తున్న వారికి అన్నం పెడుతూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.

మంచిర్యాల టౌన్‌ : పట్టణంలోని రాజీవ్‌నగర్‌, దొరగారిపల్లి, గాంధీనగర్‌కు చెందిన 80 మంది ఆటోడ్రైవర్లకు లారీ అసోసియేషన్‌ అందించిన నిత్యావసరాలను స్థానిక ఐబీ చౌరస్తాలో ఎమ్మెల్యే దివాకర్‌రావు పంపిణీ చేశారు. లారీ అసోసియేషన్‌ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. నడిపెల్లి చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ‘దివాకరన్న పెరుగన్నం’ పంపిణీలో చైర్మన్‌ విజిత్‌రావు పాల్గొన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ రాజయ్య, వైస్‌ చైర్మన్‌ ముఖేశ్‌ గౌడ్‌, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు సత్యం, శ్రీపతి వాసు ఉన్నారు. ఓవర్‌బ్రిడ్జి సమీపంలో టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు గాదె సత్యం, ఏడో వార్డు కౌన్సిలర్‌ ప్రభాకర్‌ నాయక్‌, నాయకులు శ్రీనివాస్‌ సహకారంతో చేపట్టిన అన్నదానం 40వ రోజుకు చేరుకుంది. శుక్రవారం గంధం హేమలత-శంకర్‌ దంపతులు అన్నదానం చేశారు.

బెల్లంపల్లిరూరల్‌ : టీఆర్‌ఎస్‌ నేత జక్కుల శ్రీధర్‌ జన్మదినం సందర్భంగా బెల్లంపల్లిలో 100 మంది నిరుపేదలకు 11 రకాల నిత్యావసరాలను మున్సిపల్‌ అధ్యక్షురాలు జక్కుల శ్వేత సమక్షంలో ఎమ్మెల్యే చిన్నయ్య పంపిణీ చేశారు. సీఎస్‌ఐ చర్చి పాస్టర్‌ ఆంటో నీ ఆధ్వర్యంలో 200 మంది నిరుపేదలకు ఎమ్మెల్యే సరుకులు అందించారు. 4వ వార్డులో మాజీ కౌన్సిలర్‌ ఎస్కే యూసుఫ్‌ జ్ఞాపకార్థం అతడి కుటుంబ సభ్యులు సమకూర్చిన సరుకులను 200 మంది నిరుపేదలకు చిన్నయ్య పంపిణీ చేశారు. వైస్‌ చైర్మన్‌ సుదర్శన్‌, నాయకులు గడ్డం భీమాగౌడ్‌ పాల్గొన్నారు. బీజేపీ పట్టణ కమిటీ అధ్యక్షుడు మునిమంద రమేశ్‌ ఆధ్వర్యంలో టీటీడీ కల్యాణ మండపంలో 65 మంది పేద పేయింటింగ్‌, శానిటరీ వర్కర్స్‌ కుటుంబ సభ్యులకు వ్యాపారుల సహకారంతో నిత్యావసరాలు పంపిణీ చేశారు. నాయకులు రేవెల్లి రాయలింగు, చిప్ప మనోహర్‌, సబ్బని రాజనర్సు, శ్రీనివాస్‌ పాల్గొన్నారు. పాత బెల్లంపల్లి సమీపంలోని కల్వరీ మినిస్ట్రీస్‌ చర్చి నిర్వాహకురాలు సిస్టర్‌ షారోన్‌ ఆధ్వర్యంలో వలస కూలీలకు అన్నదానం చేశారు.

చెన్నూర్‌ : పట్టణంలోని 40 మంది టాటా ఏస్‌ వాహన డ్రైవర్లకు మున్సిపల్‌ అధ్యక్షురాలు అర్చన గిల్డా నిత్యావసరాలు పంపిణీ చేశారు. సీఐ ప్రమోద్‌రావు, టీఆర్‌ఎస్‌ నాయకులు రాంలాల్‌ గిల్డా, నాయిని సతీష్‌ పాల్గొన్నారు. మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ బాపు 50 మంది పాత్రికేయులకు మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేశారు. 

తాండూర్‌ : అబ్బాపూర్‌, వాసాలమాడ, రేచిని గ్రామాల పరిధిలోని కొలాం, తోటి గిరిజన కుటుంబాలకు సరుకులను డీటీడీవో సంజీవరావు పంపిణీ చేశారు. ఎంపీపీ పూసాల ప్రణయ్‌కుమార్‌, జడ్పీటీసీ బానయ్య, సర్పంచ్‌ జంగుబాయి ఉన్నారు.

కాసిపేట : సోమగూడెంలో సర్పంచ్‌ ప్రమీలాగౌడ్‌ ఆధ్వర్యంలో ఉపా ధి హామీ కూలీలకు అంబలి పంపిణీ చేశారు. లక్ష్మీపూర్‌ గోండుగూడలో సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో 20 కుటుంబాలకు నిత్యావసరాలను అందించారు.

దండేపల్లి : మండలంలోని ప్రైవేట్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న డ్రైవర్లు, క్లీనర్లు, ఆయాలకు 15 రోజులకు సరిపడా బియ్యం, కూరగాయలు, నిత్యావసరాలను ట్రస్మా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు మధుసూదన్‌ అందించారు. ట్రస్మా మండలాధ్యక్షుడు రమేశ్‌, సురేశ్‌, మల్లేశ్‌, పోశన్న పాల్గొన్నారు.

కన్నెపల్లి : మండల కేంద్రంలోని దక్కన్‌ గ్రామీణ బ్యాంక్‌ ఆవరణలో కాకతీయ ఎనర్జీ పొల్యూషన్స్‌ ఆధ్వర్యంలో 50 మంది ఖాతాదారులకు మాస్కులు పంపిణీ చేశారు. ఎంపీడీవో శంకరమ్మ, బ్యాంక్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌, కాకతీయ ఎనర్జీ పొల్యూషన్స్‌ జిల్లా ఇన్‌చార్జి పనాస వెంకటేశ్‌ పాల్గొన్నారు. 

సీసీసీ నస్పూర్‌ : నస్పూర్‌ మున్సిపాలిటీలోని 22వ వార్డులో 80 పేద కుటుంబాలకు టీఆర్‌ఎస్‌ పార్టీ మండలాధ్యక్షుడు, కౌన్సిలర్‌ వంగ తిరుపతి ఇంటింటికీ తిరిగి కూరగాయలు అందజేశారు. ఎస్సార్పీ-3వ గని అధికారుల సహకారంతో సుమారు 400 మందికి భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. మల్లికార్జున్‌రావు, పేరం రమేశ్‌, అశోక్‌రావు, కాల్వ శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

శ్రీరాంపూర్‌ :  ఆర్కే- 8 కాలనీలో కౌన్సిలర్‌ పూదరికుమార్‌ ఆధ్వర్యంలో చైర్మన్‌ ఇసంపెల్లి ప్రభాకర్‌ 25 మంది పేదలకు బియ్యం, నిత్యావసరాలు అందించారు. టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్షుడు కే సురేందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ మల్లెత్తుల రాజేంద్రపాణి, టీఆర్‌ఎస్‌ గ్రామ కమిటీ అధ్యక్షుడు బండి తిరుపతి, పూదరికుమార్‌ యువసేన నాయకులు హరీశ్‌, తిరుపతి, వెంకటేశ్‌, కుమార్‌, సురేశ్‌, దేవేందర్‌, మల్లికార్జున్‌, శ్రీరాములు పాల్గొన్నారు.

మందమర్రి : పట్టణంలోని 25 మంది ఆటో డ్రైవర్లు, 25 మంది నిరుపేదలకు ‘ఫ్రెండ్స్‌ హెల్పింగ్‌ హ్యాండ్స్‌' సంస్థ ఆధ్వర్యంలో మంచిర్యాల జడ్పీ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, మాజీ విప్‌ నల్లాల ఓదెలు నిత్యావసరాలు పంపిణీ చేశారు. 9వ వార్డులో టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం అధ్యక్షురాలు అన్నమల్ల సుజాత 30 పేద కుటుంబాలకు బియ్యం, కూరగాయలు అందజేశారు. సభ్యులు మాధవరెడ్డి, ఉమారెడ్డి, సీతమ్మ, తోగరి వెంకన్న, లింగమూర్తి, శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

కాగజ్‌నగర్‌టౌన్‌ : పట్టణంలో సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, తన సతీమణి రమాదేవి,  జడ్పీ వైస్‌చైర్మన్‌ కోనేరు కృష్ణారావుతో కలిసి అంబలి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలు భౌతికదూరం పాటిస్తూ ప్రతి రోజూ ఉదయం అంబలి తీసుకెళ్లాలని ఆయన కోరారు. మున్సిపల్‌ చైర్మన్‌ సద్దాం హుస్సేన్‌, వైస్‌చైర్మన్‌ గిరీశ్‌కుమార్‌, కౌన్సిలర్లు జూపాక మదన్‌, ఎల్లేశ్‌ ఉన్నారు. పద్మశాలీ సేవా సంఘ భవనంలో ఎన్‌ఆర్‌ఐ చిలకమారి విఘ్నేశ్‌ కుటుంబ సభ్యుల సహకారంతో సంఘం ఆధ్వర్యంలో ఎస్‌హెచ్‌వో మోహన్‌ చేతుల మీదుగా 25 మంది చేనేత కార్మికులు, 30 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సంఘం అధ్యక్షుడు సామల రాజయ్య, కార్యదర్శి గడదాసు మల్లయ్య, కోశాధికారి సత్యనారాయణ, నాయకులు కనుకయ్య ఉన్నారు. పట్టణంలోని 160 మంది నిరుపేదలకు డ్యాన్స్‌ మాస్టర్‌ షేక్‌ యాకూబ్‌, కౌన్సిలర్‌ పిరిసింగుల జైచందర్‌తో కలిసి వెజ్‌ బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేశారు. నాయకులు రవి, సాయిగౌడ్‌, గోరంట్ల సంతోష్‌, విన్నుసింగ్‌, అబ్బుషేర్‌, సల్మాన్‌, అఫ్రోజ్‌, తిరుపతి, హేమలత, మహేశ్‌ ఉన్నారు.

బెజ్జూర్‌ (పెంచికల్‌పేట) : పెంచికల్‌పేట మండల కేంద్రంలో రేషన్‌కార్డులు లేని 60నిరుపేద కుటుంబాలకు తహసీల్దార్‌ రఘునాథ్‌ బి య్యం, పప్పు, సబ్బులు అందజేశారు. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ఝా ఆదేశాల మేరకు పేదలకు సరుకులు పంపిణీ చేశామని ఆయన తెలిపారు. ఆర్‌ఐ సంతోష్‌ ఉన్నారు.

బెజ్జూర్‌: గంగారాంగూడ, బాపుగూడ గ్రామాల్లో 55 గిరిజన కుటుంబాలకు కాగజ్‌నగర్‌ లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు హర్షవర్ధన్‌, బజరంగ్‌దళ్‌ అధ్యక్షుడు శివగూడ్‌ సహకారంతో ఏఎస్పీ వైవీఎస్‌ సుధీం ద్ర బియ్యం, పప్పులు, కూరగాయలు, బిస్కెట్‌ ప్యాకెట్లు అందజేశారు. కౌటాల సీఐ శ్రీనివాస్‌, ఎస్‌ఐ సాగర్‌, సర్పంచ్‌ కర్పెత స్వప్న, లయన్స్‌ క్లబ్‌ సభ్యులు విజయ్‌ కటారుక, రాజేందర్‌ కటారుక, నిత్యప్రకాశ్‌, చిన్నయ్య, రమేశ్‌, సురేశ్‌, శంకర్‌ ఉన్నారు.

రెబ్బెన: మండల కేంద్రంలో బ్యాంకులకు వచ్చే ఖాతాదారులు, వలస కూలీలకు ఇందిరానగర్‌ కనకదుర్గాదేవి ఆలయ అర్చకుడు వినోద్‌ అంబలి పంపిణీ చేశారు. కైర్‌గాంలో తుమోజీ సురేశ్‌చారి, బండారి లక్ష్మణ్‌ 50 మంది నిరుపేదలకు సరుకులు అందజేశారు.

కౌటాల: వివిధ ప్రాంతాల నుంచి కౌటాల మీదుగా మహారాష్ట్రకు వెళ్తున్న 250 మంది వలస కూలీలకు సహాయ సంఘం ఆధ్వర్యంలో పులిహోర ప్యాకెట్లతో పాటు అంబలి పంపిణీ చేశారు. గ్రామీణ బ్యాంక్‌కు వచ్చిన 200 మంది ఖాతాదారులకు సర్పంచ్‌ మౌనిష్‌ పులిహోర ప్యాకెట్లు అందజేశారు.logo