ఆదివారం 25 అక్టోబర్ 2020
Mancherial - May 06, 2020 , 01:54:34

హోం క్వారంటైన్‌లో 24మంది

హోం క్వారంటైన్‌లో 24మంది

  • జ్వరం, దగ్గు లక్షణాలతో కింగ్‌ కోఠికి ఒకరి తరలింపు
  • ముంబై నుంచి వచ్చిన ముగ్గురుఐసోలేషన్‌కు..
  • వారి నమూనాలు హైదరాబాద్‌కు పంపిన వైద్య సిబ్బంది

మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ/ భీమారం/ నెన్నెల : జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 903 మంది హోం క్వారంటైన్‌లో ఉండగా..  తాజాగా మంగళవారం 24మందిని 14 రోజుల పాటు ఇండ్లలోనే ఉండాలని వైద్యులు సూచించారు. అలాగే భీమా రం మండలానికి చెందిన ఓ యువతి జ్వరం, దగ్గు, దమ్ము లక్షణాలతో జిల్లాకేంద్రంలోని దవాఖానకు రాగా, ఆమెను కింగ్‌ కోఠికి తరలించారు. ముందుజాగ్రత్తగా ఆమె సంబంధీకులు, బంధువులు 20 మందిని హోం క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు ఆదేశించారు.మహారాష్ట్రలోని సిరోంచకు వెళ్లి మంగళవారం నెన్నెలకు తిరిగొచ్చిన నలుగురిని హోం క్వారంటైన్‌ చేసినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. అదే సమయంలో ముంబై నుంచి హాజీపూర్‌ మండలం రాపల్లికి చెందిన ముగ్గురు వ్యక్తులు రాగా వారికి దగ్గు, జ్వరం ఉన్నట్లు అనుమానం రావడంతో వారిని జిల్లా దవాఖానకు తరలించి అక్కడినుంచి బెల్లంపల్లి ఐసోలేషన్‌కు తరలించారు. అయితే, అన్ని కేసుల్లో కూడా కేవలం అనుమానం మాత్రమేనని భయపడాల్సిందేమీ లేదని అధికారులు చెబుతున్నారు. విదేశాల నుంచి మంచిర్యాలకు వచ్చిన వారు 260 మంది ఉన్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 74 శాంపిళ్లు సేకరించి పంపగా, అందులో 69మందికి నెగెటివ్‌ వచ్చిందని, కేవలం చెన్నూర్‌ మండలం ముత్తరావుపల్లికి చెందిన మహిళకు తప్ప ఎవరికీ పాజిటివ్‌ రాలేదని స్పష్టంచేశారు. ఇంకా నలుగురికి సంబంధించిన నివేదికలు రావాలని వెల్లడించారు.


logo