గురువారం 29 అక్టోబర్ 2020
Mancherial - Apr 13, 2020 , 02:51:10

ఇంటికే నిత్యావసర సరుకులు

ఇంటికే నిత్యావసర సరుకులు

  • పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి 

పెద్దపల్లి రూరల్‌ /పెద్దపల్లి జంక్షన్‌/జూలపల్లి : పెద్దపల్లి హెల్పింగ్‌ హ్యాండ్స్‌ ద్వారా నిత్యావసర సరుకులను నిరుపేదల ఇండ్లకే పంపిస్తామని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి స్పష్టం చేశారు. పెద్దపల్లి పట్టణంలోని రాందేవ్‌ బాబా ఆలయ ఆవరణలో నిత్యావసర సరుకుల ప్యాకింగ్‌ను ఆయన ఆదివారం పరిశీలించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిరుపేదలు పస్తులుండొద్దని పెద్దపల్లి ‘హెల్పింగ్‌ హ్యాండ్స్‌' ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పెద్దపల్లి నియోజకవర్గంలో మొదటి విడుతగా దాదాపు 10వేలకుపైగా నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందిస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట పెద్దపల్లి ఏసీపీ హబీబ్‌ఖాన్‌, సీఐ ప్రదీప్‌ కుమార్‌, ఎస్‌ఐ ఉపేందర్‌రావు, కౌన్సిలర్‌ కృష్ణమూర్తి, వ్యాపారి బాలకిషన్‌ జకోటియా, కొట్టె సదానందం ఉన్నారు. హెల్పింగ్‌ హ్యాండ్స్‌కు స్వచ్ఛంద సంస్థకు స్థానిక వ్యాపారి మాదాడి సంపత్‌రెడ్డి  10 వేల విరాళం అందజేశారు. నల్లా ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు, టీఆర్‌ఎస్‌ నాయకుడు నల్లా మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో పెద్దపల్లి నియోజకవర్గంలోని దాదాపు 3 వేల మంది ఆటో డ్రైవర్లకు వారానికి సరిపడా బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను అందించే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. జూలపల్లి, ఎలిగేడు మండలాల్లోని 430 మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలకు సామాజిక కార్యకర్త నాంపెల్లి స్వామి సహకారంతో నిత్యావసర సరుకుల ప్యాకెట్లు అందజేశారు. సింగిల్‌ విండో అధ్యక్షుడు పుల్లూరి వేణుగోపాల్‌రావు, ఆటో యూనియన్‌ మండలాధ్యక్షుడు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


logo