సోమవారం 19 అక్టోబర్ 2020
Mancherial - Apr 06, 2020 , 00:34:15

ఐక్యతా కాంతులు

ఐక్యతా కాంతులు

  • ప్రధాని, సీఎం పిలుపునకు విశేష స్పందన
  • రాత్రి తొమ్మిది గంటలకు ఇంటింటా వెలిగిన దీపాలు  
  • పాల్గొన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు 

కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కరోనా చీకట్లను పారదోలేందుకు ప్రతి ఇంట్లో దీపాలను వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన పిలుపునకు ఉమ్మడి జిల్లాలో విశేష స్పందన వచ్చింది. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాలపాటు ప్రజలు ఇంటింటా దీపాలను వెలిగించి ఐక్యతను చాటారు. ఇండ్లల్లో లైట్లు ఆర్పేసి దీపాలు, కొవ్వొత్తులు, టార్చిలైట్లు, మొబైల్‌ ఫోన్లలోని ఫ్లాష్‌ లైట్లను వెలిగించారు.  ఆలయాల్లో సహస్ర దీపాలంకరణ చేసి, ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించారు. కరీంనగరంలో ఎక్కడ చూసినా దీపాలు వెలిగిస్తూ కనిపించారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌ తమ కుటుంబ సభ్యులతో కలిసి తమ నివాసాల్లో దీపారాధన చేశారు. ఎమ్మెల్యేలు కూడా తమ ఇళ్లల్లో దీపాలు వెలిగించారు. లైట్లన్నీ ఒకే సారి నిలిపివేస్తే విద్యుత్తు గ్రిడ్‌లో సమస్యలు ఎదురు కావచ్చని భావించిన అధికారులు 9 నిమిషాలపాటు ఉన్నత స్థాయిలో పర్యవేక్షించారు.


logo