గురువారం 09 జూలై 2020
Mancherial - Mar 30, 2020 , 01:22:51

ఏప్రిల్‌ 10దాకా ఎస్సారెస్పీ నీరు

ఏప్రిల్‌ 10దాకా ఎస్సారెస్పీ నీరు

  • రైతులు పండించిన ప్రతి గింజనూ కొంటాం 
  • రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌

పెగడపల్లి : లాక్‌ డౌన్‌ నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన ‘నమస్తే’తో మాట్లాడుతూ ఏప్రిల్‌ 10వరకు ఎస్సారెస్పీ నీటిని విడుదల చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారని, దీనిపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కోతలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆధికారులను ఆదేశించినట్లు చెప్పారు. మన ప్రాంతానికి చెందిన వరి కోత యంత్రాలు ఆంధ్రా, ఇతర రాష్ర్టాల్లో నిలిచి పోయాయని, వాటిని ఇక్కడకు తెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గ్యారేజీలు, స్పేర్‌పార్ట్‌ల కోసం ఆటోస్టోర్లు మూసివేయడంపై అధికారులతో చర్చించి ఇబ్బందుల్లేకుండా చూస్తామని వివరించారు. ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని, స్థానికంగా హమాలీలను ఏర్పాటు చేసుకునేలా సెర్ప్‌, సహకార సంఘాల బాధ్యులు చూసుకోవాలని సూచించారు.  logo