బుధవారం 21 అక్టోబర్ 2020
Mancherial - Mar 10, 2020 , 01:16:11

చురుగ్గా కొనసాగుతున్న ‘పల్లె ప్రగతి’ పనులు

చురుగ్గా కొనసాగుతున్న ‘పల్లె ప్రగతి’ పనులు

మంచిర్యాల రూరల్‌ : హాజీపూర్‌ మండలంలోని 17 గ్రామ పంచాయతీలలో పల్లె ప్రగతి పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇందులో ప్రధానంగా వైకుంఠధామాలు (శ్మశానవాటికలు), డంపింగ్‌ యార్డులు, కంపోస్ట్‌ షెడ్లు, ఇంకుడు గుంతలు నిర్మా ణ పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా వైకుంఠధామాల పనులు యుద్ధప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల నిర్వహణలో బిల్లులు పెండింగ్‌ ఉండటాన్ని సర్పంచ్‌లు గుర్తించారు. ఈ విషయాలపై పంచాయతీ కార్యదర్శులతో చర్చించి నిర్మాణ పనులు వేగవంతం చేశారు. ఉపాధి హామీ పథకం నుంచి వైకుంఠధామం(శ్మశానవాటిక)లకు ఒక్కొక్క దానికి రూ.12.60 లక్షలు కేటాయించారు. డం పింగ్‌ యార్డుకు ఒక్కొక్క దానికి రూ.10 లక్షలు, కంపోస్ట్‌ షెడ్డు ఒక్కొక్క దానికి రూ.3.50 లక్షలు కేటాయించారు. ఈ నిధులతో పనులు ముమ్మరం గా సాగుతున్నాయి. మరికొన్ని గ్రామాల్లో పనులు ఊపందుకున్నాయి. మొదటగా ప్రభుత్వ భూములను సర్వే చేసి రెవెన్యూ అధికారులు గుర్తిస్తున్నారు. భూమి లేనిచోట దాతల సహకారంతో భూమిని కొనుగోలు చేసేందుకు పంచాయితీ అధికారులు, సభ్యులు చూస్తున్నారు.

17 గామాల్లో వేగంగా.. 

హాజీపూర్‌ మండలంలోని హాజీపూర్‌, దొనబండ గ్రామ పంచాయతీ(జీపీ)ల్లో నిర్మాణాలు తుదిదశకు చేరుకున్నాయి. మిగిలిన 15 జీపీల్లోని పెద్దంపేట, గఢ్‌పూర్‌ గ్రామ పంచాయతీలకు ప్ర భుత్వ భూమిని కేటాయించారు. అయితే ఆ భూ మి అటవీశాఖ  ఆధ్వర్వంలో ఉండటంతో అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నారు. టీకన్నపల్లె గ్రామ పంచాయతీలోని ప్రభుత్వ భూమిని కేటాయించారు. ఆ భూమిలో నేను కబ్జాలో ఉన్నానం టూ ఒక వ్యక్తి కోర్టులో కేసు వేశాడు. కోర్టు ఉత్తర్వులు రాగానే మొదలు పెట్టనున్నారు. 12 గ్రామ పంచాయతీల్లో పనులు ముందుకు సాగుతున్నా యి. వేంపల్లి, గుడిపేట, నంనూర్‌, రాపల్లి, కర్ణమామిడి, పడ్తన్‌పల్లి, హాజీపూర్‌, బుద్దిపల్లి, దొనబండ, పెద్దంపేట, చిన్నగోపాల్‌పూర్‌, ర్యాలీ, గఢ్‌పూర్‌, నర్సింగాపూర్‌, నాగారం గ్రామాల్లో ప్రభు త్వ స్థలాలను కేటాయిచడంతో పనుల నిర్మాణా లు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ పనులను పంచాయతీరాజ్‌ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కార్యదర్శులు పనులు పూర్తయ్యేలా చూస్తున్నారు.


logo