శనివారం 31 అక్టోబర్ 2020
Mancherial - Mar 05, 2020 , 00:27:02

తెలంగాణకే రోల్‌మోడల్‌ తాళ్లగూడెం

తెలంగాణకే రోల్‌మోడల్‌ తాళ్లగూడెం

భీమారం : తెలంగాణకే రోల్‌ మోడల్‌గా భీమా రం మండలం పోలంపల్లి గ్రామ పరిధిలోని తాళ్లగూడెం మారబోతోందనీ, రాష్ట్రంలోనే మొదటి సారిగా ఆయిల్‌ పామ్‌ తోటల సాగుకు శ్రీకారం చుట్టామని ప్రభుత్వ విప్‌, చెన్నూర్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ పేర్కొన్నారు. తాళ్లగూడెంలో విప్‌ సుమన్‌ సొంత భూమిలో 12 ఎకరాల్లో  బుధవా రం ఆయిల్‌ పామ్‌ మొక్కలను పెద్దపల్లి ఎంపీ బో ర్లకుంట వెంకటేశ్‌ నేతకాని, మంచిర్యాల, పెద్దప ల్లి, రామగుండం ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, దాసరి మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్యే, కోరుకంటి చందర్‌, కలెక్టర్‌ భారతి హోళికేరి, జడ్పీ అధ్యక్షురాలు నల్లాల భాగ్యలక్ష్మి, పెద్దపల్లి జడ్పీచైర్మన్‌ పుట్ట మధుతో కలిసి విప్‌ నాటారు. విప్‌ బాల్క సుమన్‌ మాట్లాడుతూ జైపూర్‌ మండలంలో ఆయిల్‌ పామ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రభుత్వం జీఓ ఈ రోజే జారీ చేసిందనీ, రాష్ట్రంలో 45 వేల ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని తెలిపారు. రైతులను ప్రోత్సహించడానికే తాను ఆయిల్‌ పామ్‌ సాగుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ పంట సాగుతో లాభాలు అధికంగా ఉంటాయనీ, చెన్నూర్‌ నియోజకవర్గంలోని 5 మండలాల్లో 108 గ్రామాల్లో 513 ఎకరాల్లో సాగే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. 


రైతులు భారీ సంఖ్యలో ఆయిల్‌ పామ్‌ మొక్కలు నాటాలని సూచించారు. పెద్దపల్లి ఎంపీ వేంకటేశ్‌ నేతకాని మాట్లాడుతూ బాల్క సుమన్‌ మంచి విజ న్‌ ఉన్నా నాయకుడు అని పేర్కొన్నారు. ఆయిల్‌ పామ్‌ తోటల సాగుకు విప్‌ సుమన్‌ ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నుంచి చెన్నూర్‌ నియోజకవర్గంలో ఉన్న 1 లక్షా 35వేల ఎకరాల భూ ములకు సాగు నీరు అందించే బృహత్తర కార్యక్రమానికి పునుకున్నారని తెలిపారు. రైతులు బాగుపడితేనే బంగారు తెలంగాణ సాధ్యం అవుతుందనీ, రైతు రారాజు కావాలంటే వాణిజ్య పంటల వైపు దృష్టి సారించాలని కలెక్టర్‌ భారతి హోళికేరి సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ తిప్పని లింగయ్య, గ్రంథాల య చైర్మన్‌ రేణికుంట్ల ప్రవీణ్‌, ఎంపీపీ చెఱుకు దీపికా రెడ్డి, జడ్పీటీసీ భూక్య తిరుమల నాయక్‌, డీహెచ్‌ఎస్‌ఓ యుగేందర్‌, డీఏఓ వినోద్‌ కుమార్‌, మంచిర్యాల డీసీపీ ఉదయ్‌ కుమార్‌ రెడ్డి, సర్పంచ్‌ దర్శనాల రమేశ్‌, మండల రైతు సమన్వయ సమి తి కోఆర్డినేటర్‌ కలగూర రాజ్‌ కుమార్‌, టీఆర్‌ఎస్‌ నేతలు చెఱుకు సరోత్తమారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కొత్తపోటు రాజేశ్వర్‌రెడ్డి సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.