బుధవారం 28 అక్టోబర్ 2020
Mancherial - Mar 05, 2020 , 00:24:02

తొలి రోజు ప్రశాంతం

తొలి రోజు ప్రశాంతం

మంచిర్యాల అగ్రికల్చర్‌ : జిల్లాలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభం కాగా తొలిరోజు ప్రశాంతంగా జరిగాయి. జిల్లావ్యాప్తంగా 26 పరీక్షా కేంద్రాలను కేటాయించారు. మంచిర్యాల మండలంలో తొమ్మిది, మందమర్రిలో రెండు, చెన్నూర్‌లో రెండు, బెల్లంపల్లిలో మూడు, కాసిపేటలో ఒకటి, జైపూర్‌లో ఒకటి, జన్నారంలో రెండు, దండేపల్లిలో ఒకటి, లక్షెట్టిపేట మండలంలో ఐదు కేంద్రాలను ఏర్పాటుచేశారు. డెక్‌ కన్వీనర్‌, డీఐఈఓ ఇంద్రాణి, సభ్యులు జీ.ఎలీషాదేవి, సీనియర్‌ అధ్యాపకులు ఏ.అంజయ్యలు పోలీస్‌స్టేషన్‌ కస్టోడియన్‌ పాయింట్‌ మంచిర్యాలను సందర్శించారు. బుధవారం సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1, తెలుగు-1, సంస్కృతం-1, ఉర్దూ-1, హిందీ-1 పరీక్షల్లో సెట్‌-ఏ ప్రశ్నపత్రాన్ని ఉపయోగించారు. ఫస్ట్‌ ఇయర్‌ సెకండ్‌ లాంగ్వేజ్‌-1లో జనరల్‌ కోర్సుల్లో 6862 విద్యార్థులకుగాను 6507(94.82 శాతం) విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 355 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌ కోర్సుల్లో 1634 విద్యార్థులకుగాను 1465(89.65 శాతం) విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 169 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొదటి రోజు 8496మంది విద్యార్థులకుగాను 7972(93.83 శాతం) మంది హాజరయ్యారు. డీఐఈఓ ఇంద్రాణితో పాటు డెక్‌ సభ్యులు మంచిర్యాలలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల సెంటర్‌ ఏ, బీలను, నేషనల్‌ ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలను, శ్రీహర్ష జూనియర్‌ కళాశాలను, మిమ్స్‌ జూనియర్‌ కాలేజ్‌, ప్రతిభ జూనియర్‌ కళాశాలలను సందర్శించారు.


logo