ఆదివారం 25 అక్టోబర్ 2020
Mancherial - Mar 03, 2020 , 22:25:14

సమగ్రాభివృద్ధే లక్ష్యం

 సమగ్రాభివృద్ధే లక్ష్యం
  • పరేడ్‌గ్రౌండ్‌లో జాతీయ జెండా ఎగరేసిన కలెక్టర్‌ భారతి హోళికేరి

  •  వయోజనులైన నిరక్షరాస్యులను అక్షరాస్యు లుగా మార్చేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో అమ్మ-నాన్నకు చదువు, ఈచ్‌ వన్‌-టీచ్‌ వన్‌ కార్యక్రమాలతోపాటు పడ్‌నా లిఖ్‌నా, అభియాన్‌ కార్యక్రమం ద్వారా 10,830 మంది వయోజనులకు విద్యనందిస్తున్నాం. 
  • మిషన్‌ భగీరథ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ నల్లాల ద్వారా శుద్ధ తాగు నీరు అందిస్తున్నాం.  
  •  మిషన్‌ కాకతీయ పథకం ద్వారా రూ.139 కోట్ల అంచనా వ్యయంతో 473 పనులు మంజూ రు కాగా.. ఇప్పటివరకు రూ. 89 కోట్లు ఖర్చు చేసి 420 పనులు పూర్తి చేయడంతోపాటు 45,652 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతున్నది. మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయి.
  • జిల్లాలో 311 గ్రామ పంచాయతీలు ఉన్నా యి. పల్లె ప్రగతి కార్యాచరణ ప్రణాళిక ద్వారా  అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వ యంతో ప్రజలను భాగస్వాములను చేస్తూ శ్రమ దానం చేసి గ్రామాలను పరిశుభ్రం చేసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించ డం, చెత్త సేకరణకు 98 ట్రాక్టర్లు, ట్రాలీ, ట్యాంకర్‌ కొనుగో లు చేసి గ్రామాలకు అందించడంతోపాటు 27 టన్నుల ప్లాప్టిక్‌ వ్యర్థాలను తొలగించి ప్లాస్టిక్‌ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడమైనది. 


logo