బుధవారం 21 అక్టోబర్ 2020
Mancherial - Mar 04, 2020 , 04:00:02

పారిశుధ్యం అందరి బాధ్యత

పారిశుధ్యం అందరి బాధ్యత
  • జడ్పీ అధ్యక్షురాలు నల్లాల భాగ్యలక్ష్మి
  • మందమర్రిలో పట్టణ ప్రగతి

మందమర్రి: పారిశుధ్యం, పచ్చదనం అందరి బాధ్యతని జడ్పీ అధ్యక్షురాలు నల్లాల భాగ్యలక్ష్మి పిలుపునిచ్చారు. పట్టణ ప్రగతిలో భాగంగా మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని 8, 9 వార్డుల్లో మంగళవారం పర్యటించి పనులు చేపట్టారు. మూడో జోన్‌ ఏరియాలో ఖాళీ స్థలంలో పేరుకుపోయిన పిచ్చి మొక్కలను తొలగించారు. అనంతరం మున్సిపల్‌ కమిషనర్‌ గద్దె రాజు, టీఆర్‌ఎస్‌ నాయకులు, మహిళా నాయకురాళ్లతో కలసి మొ క్కలను నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్థానికులకు సూచించారు. ఆరు నెలల క్రితం నిర్వహించిన పల్లె ప్రగతి మంచి ఫలితాలు ఇచ్చిందని దాని స్ఫూర్తిగానే పట్టణ ప్రగతికి సీఎం శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. వార్డుల ఇన్‌చార్జిలు, ప్రత్యేక అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


వ్యర్థాలను తొలగించాలి: కలెక్టర్‌

పట్టణ ప్రగతి పనులను కలెక్టర్‌ భారతి హోళికే రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కమిషనర్‌ గద్దె రాజుతో కలసి పాత బస్టాండ్‌ ఏరియా, రామన్‌ కాలనీ, కోల్‌బెల్ట్‌ రహదారి పక్కన మాంసం విక్రయదారులు వేసిన వ్యర్థాలను పరిశీలించారు. రహదారి పక్కన వ్యర్థాలు పడవేయడంతో దుర్వాసన వస్తుందనీ కాలనీ వాసులు, ప్రయాణికులు, బాట సారులు ఇబ్బంది పడుతున్నారనీ, కాలనీలకు వ్యా ధులు వ్యాపించే ప్రమాదం ఉందన్నారు. వెంటనే తొలగించాలని కమిషనర్‌ను ఆదేశించారు. వ్యాపారులు మరోసారి రోడ్డు పక్కన వ్యర్థాలు వేస్తే భారీ జరిమానాలు ఉంటాయని హెచ్చరించారు. 


పనులపై కలెక్టర్‌ సంతృప్తి

బెల్లంపల్లి, నమస్తే తెలంగాణ: బెల్లంపల్లిలో           కొనసాగుతున్న పట్టణ ప్రగతి పనులపై కలెక్టర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. 15వ వార్డు కౌన్సిలర్‌ రా మగిరి రామకృష్ణ కాలనీలో పారిశుధ్యం, ప్లాస్టిక్‌ నిర్మూళనకు ప్రజలకు పేయింటింగ్స్‌ ద్వారా అవ గాహన కల్పించారు. వాటిని ఎమ్మెల్యే చిన్నయ్య తో పరిశీలించిన ఆమె కౌన్సిలర్‌ను అభినందించా రు. కన్నాలబస్తీ శివారులో గల నర్సరీని పరిశీలించాడానికి బెల్లంపల్లి వచ్చిన కలెక్టర్‌ వార్డులో ప్రత్యేకతలను తెలుసుకొని సందర్శించారు. వార్డులో నాటిన మొక్కల సంరక్షణ కోసం టైర్లను సుందరం గా అలంకరించడంపై ప్రశంసించారు. వార్డు కౌన్సిలర్‌ రామగిరి రామకృష్ణ, వార్డు ప్రత్యేకాధికారి కపిల్‌దేవ్‌, వార్డు ప్రజలను ప్రత్యేకంగా అభినందించారు. వార్డుల్లోని వీధులన్నీ కొత్తదనాన్ని సంతరించుకున్నాయని కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు. ప్రతి కౌన్సిలర్‌ ఈ వార్డును ఆదర్శంగా తీసుకోవా లని పిలుపునిచ్చారు. అనంతరం గాంధీనగర్‌లో పట్టణ ప్రగతిలో పాల్గొన్నారు. ప్రజలకు తడిపొడి చెత్త బుట్టలను పంపిణీ చేశారు. బెల్లంపల్లి మున్సి పల్‌ అధ్యక్షురాలు జక్కుల శ్వేత, కమిషనర్‌ ఆకుల వెంకటేశ్‌, వైస్‌ చైర్మన్‌ బత్తుల సుదర్శన్‌, మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, మున్సిపల్‌ కౌన్సిలర్‌ బండి ప్రభాకర్‌ పాల్గొన్నారు.

రామకృష్ణాపూర్‌: పట్టణ ప్రగతిని విజయవం తం చేయాలని కలెక్టర్‌ భారతి హోళికేరి కోరారు.  క్యాతనపల్లి మున్సిపాలిటీలోని 8వ వార్డు శ్రీనివా స గార్డెన్‌ ఏరియాలో పర్యటించి ప్రగతి పనులను పరిశీలించారు. మున్సిపాలిటీలోని 7, 8, 9, 10 వార్డుల్లోని జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న ముళ్ల పొదలను జేసీబీతో తొలిగించి శుభ్రం చేసే కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రధాన రహదారికి ఇరు వైపులా హరిత హా రంలో మొక్కలు నాటికి ట్రీగార్డులు ఏర్పాటు చేసి సంరక్షించాలని కమిషనర్‌ వెంకటనారాయణను ఆదేశించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లతో పాటు వార్డు కమిటీల సభ్యులను భాగస్వామ్యం చేయాలని అప్పుడే  విజయవంతం అవుతుందని తెలియజేశారు. మున్సిపల్‌ చైర్‌ పర్స న్‌ జంగం కళ, వైస్‌ చైర్మన్‌ అర్రం విద్యాసాగర్‌రెడ్డి,  మేనేజర్‌ కీర్తి నాగరాజు, కౌన్సిలర్లు పొలం సత్యనారాయణ, అలుగుల శ్రీలత, పారుపల్లి తిరుపతి, పనాస రాజయ్య, తదితరులు పాల్గొన్నారు. 


logo