గురువారం 22 అక్టోబర్ 2020
Mancherial - Mar 02, 2020 , 23:09:16

జోరుగా సాగుతున్న పట్టణ ప్రగతి

జోరుగా సాగుతున్న పట్టణ ప్రగతి

మున్సిపాలిటీల్లో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం జోరుగా హుషారుగా సాగుతోంది. తద్వారా పట్టణాలకు ప్రగతి శోభ సంతరించుకుంటున్నది. ప్రజాప్రతినిధులు, అధికారులు, కౌన్సిలర్లు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సోమవారం నస్పూర్‌ మున్సిపాలిటీలోని 12వ వార్డు తాళ్లపల్లి పునరావాసకాలనీలో మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు పట్టణ ప్రగతి కమిటీ సభ్యులతో కలిసి పర్యటించారు. కాలనీవాసుల సమస్యలు తెలుసుకున్నారు. అలాగే బెల్లంపల్లిలో 32వార్డు బాబుక్యాంపు స్వచ్ఛ ముఖద్వారంతోరణాన్ని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రారంభించారు. నస్పూర్‌ మున్సిపాలిటీలో జిల్లా కలెక్టర్‌ భారతి హోళికేరి పర్యటించారు. మొక్కల రక్షణపై తీసుకుంటున్న చర్యలపై సిబ్బంది అడిగి తెలుసుకున్నారు. రోడ్డు పక్కన, కాలనీల్లో చెత్త కనిపించవద్దని ఆదేశించారు. చెన్నూర్‌లోని ప్రధాన రహదారి పనులు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ రూ. 23కోట్లను ప్రభుత్వం నుంచి మంజూరు చేయించారు.                          


సీసీసీ నస్పూర్‌: నస్పూర్‌ మున్సిపాలిటీలో కలెక్టర్‌ భారతి హోళికేరి పర్యటించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పర్యటించి తనిఖీలు చేపట్టారు. నర్సరీని పరిశీలించి, అక్కడ అందుబాటులో ఉంచిన మొక్కల వివరాలను కమిషనర్‌ రాధా కిషన్‌ను అడిగి తెలుసుకున్నారు. మొక్కల రక్షణపై తీసుకుంటున్న చర్యలపై సిబ్బందిని అడిగి తెలుసుకొని స లహాలిచ్చారు. అనంతరం అరుణక్క నగర్‌ ప్రాంతం లో రోడ్డు పక్కన నాటిన మొక్కలను పరిశీలించారు. పెట్టిన మొక్కల రక్షణ తీసుకుంటున్న చర్యల గురించి తెలుసుకున్నారు. నాటిన ప్రతి మొక్కను బతికించాలనీ, ఒక్క మొక్క కూడా ఎండిపోకూడదన్నారు. రో డ్డు పక్కన, కాలనీల్లో చెత్త కనిపించవద్దనీ, మున్సిపాలిటీలో పోగు చేసిన చెత్తను డంప్‌యార్డుకు తరలించాలని ఆదేశించారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ ప డే టయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అందరూ కలిసికట్టుగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. 


విజయ వంతం చేయండిఅదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

 ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతిని పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌(లోకల్‌ బాడిస్‌) ఇలా త్రిపాఠి సూచించారు. చెన్నూర్‌ మున్సిపాలిటీలో నిర్వహిస్తున్న పట్ట ణ ప్రగతిపై కార్యాలయంలో మున్సిపల్‌ చైర్మన్‌ అర్చ న గిల్డా, కమిషనర్‌ బాపు, ఇతర అధికారులతో ఆమె సోమవారం సమావేశం నిర్వహించారు. పట్టణ ప్రగ తి జరుగుతున్న తీరును తెలుసుకొని సూచనలు చేశా రు. అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆదేశించా రు. వార్డుల్లో కౌన్సిలర్లు, కమిటీ సభ్యులు, ప్రత్యేకాధికారి, ప్రజల భాగస్వామ్యంతో పారిశుధ్య పనులు నిర్వహించారు. పట్టణ ప్రగతిపై అవగాహన కల్పించారు. ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించి నిరక్ష్యరాస్యులను గుర్తించారు. వార్డుల్లో పర్యటిస్తూ సమస్యలను గుర్తించారు. 17వ వార్డులో బోరు బావికి వెం టనే మరమ్మతు చేయించాలని అధికారులను ఆదేశించారు. వైస్‌ చైర్మన్‌ నవాజొద్దీన్‌ పలు వార్డుల్లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు.


logo