ఆదివారం 25 అక్టోబర్ 2020
Mancherial - Mar 02, 2020 , 23:05:34

సుందరంగా తీర్చిదిద్దాలి

సుందరంగా తీర్చిదిద్దాలి

సీసీసీ నస్పూర్‌: పట్టణ ప్రగతితో నస్పూర్‌ మున్సిపాలిటీ సుందరంగా మారుతుందని ఎమ్మె ల్యే దివాకర్‌రావు పేర్కొన్నారు.  12వ వార్డు తాళ్లపల్లి పునరావాసకాలనీలో చైర్మన్‌ ఇసంపల్లి ప్రభాకర్‌, వైస్‌ చైర్మన్‌ తోట శ్రీనివాస్‌, కౌన్సిలర్లు, పట్ట ణ ప్రగతి కమిటీ సభ్యులతో కలిసి సోమవారం పర్యటించారు. కాలనీవాసుల సమస్యలు తెలుసుకున్నారు. ప్రజలు ఎమ్మెల్యేకు తమ సమస్యలు తెలుపగా పట్టణ ప్రగతిలో అన్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పునరావాస కాలనీని మున్సిపాలిటీకి అప్పగించాలని కాలనీవాసులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. పట్టణాల రూపురేఖలు మారాలనే పట్టణ ప్రగతి చేపట్టినట్లు చెప్పారు. ప్రజల భాగస్వామ్యం ఉంటే ఈ కార్యక్రమం విజయవం తం అవుతుందన్నారు. ప్రజలు తమ పరిసరాల ను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కమిషనర్‌ రాధా కిషన్‌, కౌన్సిలర్లు వంగ తిరుపతి, బం డారి సంధ్యారాణి, బొద్దున సంధ్యారాణి, బండి పద్మ, నాయకులు అక్కూరి సుబ్బయ్య, బండారి సుధాకర్‌, గుంట జగ్గయ్య, మల్లెత్తుల రాజేంద్రపాణి, హైమద్‌, పెరుమాళ్ల జనార్దన్‌ పాల్గొన్నారు. బెల్లంపల్లి, నమస్తే తెలంగాణ: స్వచ్ఛ బెల్లంపల్లిగా పట్టణాన్ని మార్చుకుందామని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పిలుపునిచ్చారు. పట్టణ ప్రగతి లో భాగంగా 14, 21, 26 వార్డుల్లో ప్రజలకు చెత్త బుట్టలను సోమవారం పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో భాగం గా పట్టణంలోని 34 వార్డుల్లో ప్రజలకు ప్రభుత్వం తడి, పొడి చెత్త బుట్టలను పంపిణీ చేసిందన్నారు. పారిశుధ్యానికి వినియోగించాలని సూచించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడంలో అంద రూ భాగస్వాములు కావాలని కోరారు. పట్టణం పరిశుభ్రంగా ఉంచుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామని వెల్లడించారు. స్వచ్ఛ బెల్లంపల్లి సాధనకు అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. తడి, పొడి చెత్తపై వార్డుల్లో ప్ర జలకు విరివిగా చెప్పాలన్నారు. బెల్లంపల్లి మున్సిపల్‌ అధ్యక్షుడు జక్కుల శ్వేత, వైస్‌ చైర్మన్‌ బత్తుల సుదర్శన్‌, కమిషనర్‌ ఆకుల వెంకటేశ్‌, కౌన్సిలర్లు బొడ్డు నారాయణ, బడికల కమల, పోతురాజుల లీల, టీఆర్‌ఎస్వీ నాయకుడు బడికల శ్రావణ్‌ తదితరులు పాల్గొన్నారు.logo