శుక్రవారం 30 అక్టోబర్ 2020
Mancherial - Mar 02, 2020 , 23:05:34

ప్రధాన రహదారి వెడల్పు పనులు ప్రారంభం

ప్రధాన రహదారి వెడల్పు పనులు ప్రారంభం

చెన్నూర్‌, నమస్తే తెలంగాణ: చెన్నూర్‌ పట్టణంలోని ప్రధాన రహదారి పనులు ప్రారంభమయ్యాయి. జలాల్‌ పెట్రోల్‌ పంప్‌ నుంచి అంబేద్కర్‌ చౌక్‌ వరకు ప్రధాన రహదారి వెడ ల్పు, డివైడర్‌ నిర్మాణం, మురికి కాలువలు, ఫుట్‌ పాత్‌ల నిర్మాణం, సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టం ఏర్పాటుకు విప్‌ బాల్క సుమన్‌ రూ. 23 కోట్లను ప్రభుత్వం నుంచి మంజూరు చేయించారు. నిధులు మంజూరవగానే ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ పనుల ప్రారంభానికి శంకుస్థాపన చేశారు. ఇప్పటికే టెండర్‌ పక్రియ పూర్తవడంతో సంబంధిత కంట్రాక్టర్‌ పనులను ప్రా రంభించారు. ముందుగా రోడ్డు వెడల్పు పనులకు అడ్డుగా ఉన్న చెట్లను తొలగించాల్సి ఉండడంతో పనులను సోమవారం ప్రారంభించా రు. మున్సిపాలిటీ చైర్మన్‌ అర్చన గిల్డా చెట్ల తొ లగింపు పనులను ప్రారంభించారు.   ఈ చెట్ల తొలగింపు పక్రియను మున్సిపాలిటీ వైస్‌ చైర్మన్‌ నవాజొద్దీన్‌, కమిషనర్‌ బాపు, కౌన్సిలర్లు రేవెల్లి మహేశ్‌, జన్నాధుల శ్రీనివాస్‌, తుమ్మ రమేశ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు రాంలా ల్‌ గిల్డా, జాడి తిరుపతి, నాయిని సతీశ్‌, మేడ సురేశ్‌ రెడ్డి, సుధాకర్‌, ఆరీఫ్‌, మహేందర్‌ పర్యవేక్షించారు.