శనివారం 31 అక్టోబర్ 2020
Mancherial - Mar 02, 2020 , 22:14:39

అర్హులకే పరిహారం ఇవ్వాలి

అర్హులకే పరిహారం ఇవ్వాలి

కాసిపేట: దుబ్బగూడెం కల్యాణిఖని ఓపె న్‌ కాస్ట్‌లో నష్టపోతున్న నిజమైన లబ్ధిదారులకే పరిహారం ఇవ్వాలని నిర్వాసిత దుబ్బగూడెం గ్రామస్తులు కోరారు. ఈ మేరకు బె ల్లంపల్లి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం వినతిపత్రం ఇచ్చారు. వారు మాట్లాడుతూ దుబ్బగూడెం గ్రామం కేకే ఓసీ ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకెజీలో ఉందని కొంత మంది మా గ్రామానికి సంబంధం లేని వారు పలువురు అధికారుల అండదండలతో పరిహారం కోసం గ్రామంలో చిన్న చిన్న గృహాలు నిర్మించుకున్నారనీ, ఇలాంటి వారి పేర్లు పరిహారం అందించే ప్రాథమిక నోటిఫికేషన్‌లో ప్రకటించారని పేర్కొన్నారు. గ్రామానికి సంబంధం లేని వారి పేర్లు నోటిఫికేషన్‌లో వచ్చాయనీ, అసలైన లబ్ధిదారుల పేర్లు నమోదు కాలేదన్నారు. అసలైన లబ్ధిదారుల వివరాలు తెలియాలంటే సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రీ సర్వే నిర్వహించి నిజమైన లబ్ధిదారులకు మాత్రమే పరిహారం అందించాలని కోరారు.