గురువారం 04 జూన్ 2020
Mancherial - Mar 02, 2020 , 01:53:36

జోరుగా.. హుషానుగా

జోరుగా.. హుషానుగా

సిరిసిల్ల, నమస్తే తెలంగాణ: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పట్టణ ప్రగతి సిరిసిల్ల, వే ములవాడ మున్సిపాలిటిల్లో జోరుగా హుషారుగా కొనగుతున్నది. వార్డు ప్రజలు , కౌన్సిలర్లు, అధికారుల భా గస్వామ్యంతో పరిశుభ్రత పనులు జరుగుతున్నాయి. వార్డుల్లోని చెత్తను తొలగిస్తూ పరిశుభ్రతకు బాటలు వేస్తున్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని 4, 18, 19, 29 వార్డుల్లో కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ పర్యటించారు. పట్టణ ప్రగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వేములవాడ పట్టణ ప్రగతి లో పలు వార్డుల్లో ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన ర్యాలీలు నిర్వహించారు. ఆయా కా ర్యక్రమాల్లో వేములవాడ మున్సిపల్‌ అధ్యక్షురాలు మాధవి, వైస్‌ చైర్మన్‌ రాజేందర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసరెడ్డి ఆయా వార్డుల్లో కౌన్సిలర్లు పాల్గొన్నారు.

పరిశుభ్రత పాటించాలి: కలెక్టర్‌

సిరిసిల్లటౌన్‌: ఖాళీ స్థలాల్లో నిల్వనీరు, పిచ్చిమొక్కలు తొలగించకుండా నిర్లక్ష్యం వహించినా, పరిశుభ్రత పాటించకపోయినా.. ఎవరినీ ఉపేక్షించేదిలేదని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ హెచ్చరించారు. పట్టణ ప్రగతి అ మలులో అందరూ భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని 4, 18, 19, 29వార్డుల్లో ఆదివారం నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మురుగునీటి కా ల్వల పూడికతీత పనులు, మొక్కల పెంపకం, పారిశు ధ్యం నిర్వహణ, తదితర పనులను పరిశీలించారు. అ నంతరం ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రగతి ప్రధాన లక్ష్యాలు పారిశుధ్యం, పౌరులకు మౌలిక సౌకర్యాల క ల్పన, పచ్చదనం పెంపు అని వివరించారు. ఆ లక్ష్యాల సాధనకు పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పట్టణంలో ఎవరు కూడా బయట చె త్త వేయకూడదన్నారు. గృహ వ్యర్థాలను తడి, పొడి గా విభజించి ప్రతి రోజూ ఉయదం ఇంటి ముందుకు వచ్చే మున్సిపల్‌ వాహనాలకు అందించాలని సూచించారు. ఇష్టానుసారంగా చెత్తను రోడ్లపై పారవేస్తే జరిమానా విధిస్తామని తెలిపారు. 

మొక్కలను నాటాలి

సిరిసిల్ల పట్టణంలో మ రింత పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రతి వార్డులో రోడ్లకు ఇరువైపులా మొక్క లు నాటాలని కలెక్టర్‌ సూచించారు. అలాగే ప్రతి ఇంటి లో సాధ్యమైనన్ని ఎక్కువ మొక్కలు పెంచాలని పేర్కొన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా పట్టణంలోని అన్ని ప్రధాన మురుగు కాలువలు, ఉప మురుగుకాలువలలోని పూడికను తొలగించాలని మున్సిపల్‌ సిబ్బందికి సూచించారు. పట్టణ ప్రణాళికలో భాగంగా దెబ్బతిన్న, వంగిన, తుప్పుపట్టిన విద్యుత్‌ స్తంభాల స్థానంలో కొ త్తవి ఏర్పాటుచేయాలని సెస్‌ అధికారులను ఆదేశించారు. లూజ్‌ వైర్లను, రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత్‌ స్తంభాలను వెంటనే సరిచేయాలన్నారు. పట్టణ ప్రగతి నిరంతర కార్యక్రమమని, వార్డు కమిటీలు శాశ్వతంగా కొనసాగుతాయన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చే పట్టిన పట్టణ ప్రగతి ప్రణాళికను జిల్లాలో విజయవం తం చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ అధ్యక్షురాలు జిందం కళ, మున్సిపల్‌ ఉపాధ్యక్షుడు మంచె శ్రీనివా స్‌, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, కమిషనర్‌ వెల్దండి సమ్మయ్య, గ్రంథాలయ పరిషత్‌ జిల్లా చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వినర్‌ నర్సయ్య, కౌన్సిలర్లు వెల్దండి దేవదాస్‌, అన్నారం శ్రీనివాస్‌, చందన, గెంట్యాల శ్రీనివాస్‌, వా ర్డుకమిటీల సభ్యులు పాల్గొన్నారు. 

పట్టణంలో ప్రగతి జోరు

జిల్లా కేంద్రమైన సిరిసిల్ల పట్టణంలో జోరుగా సాగుతోంది. అన్ని వార్డుల్లో కౌన్సిలర్లు, వార్డుకమిటీ స భ్యులు, స్థానికులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. 33వ వార్డులో కౌన్సిలర్‌ లత వినూత్న కార్యమాన్ని చేపట్టారు. హరితహారంలో నాటిన మొక్కలకు స్థానికులతో కలిసి రంగులు వేశారు. 32వ వార్డులోని ఖాళీ స్థలాల్లో పేరుకుపోయిన చెత్తను స్థానికులతో కలిసి స య్య ద్‌ సీమాబేగం తొలగించారు. 31వ వార్డులో తుమ్మ రాధ స్థానికులతో కలిసి రోడ్లను ఊడ్చి శుభ్రం చేశారు. 39వ వార్డులో స్థానిక కౌన్సిలర్‌ ఆకుల కృష్ణ ఆధ్వర్యంలో వార్డు కమిటీ సభ్యులు అన్ని వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వార్డు కమిటీల సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. 


logo