శుక్రవారం 05 జూన్ 2020
Mancherial - Mar 02, 2020 , 01:48:49

డిమాండ్‌ ఉన్న మొక్కలనే పెంచాలి

  డిమాండ్‌ ఉన్న మొక్కలనే పెంచాలి

ఎల్లారెడ్డిపేట: మండలం హరిదాస్‌నగర్‌లో పల్లెనిద్ర కార్యక్రమాన్ని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు, ఎంపీపీ పిల్లి రేణుకతో కలిసి స్థానిక అధికారులతో మాట్లాడారు. నాటిన మొక్కల్లో ప్రస్తుతం  మనుగ డలో ఉన్న మొక్కలపై ఆరాతీశారు. రికార్డును పరిశీలించి సమాచారం సరిగా రాయలే దని, క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించి ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి ఇంట్లో కృష్ణ తులసి మొక్కను నాటుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఇండ్లలో స్థలం లేని వారు తమవంతు బాధ్యతగా రోడ్డుపక్కన రెండు మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. పల్లెప్రగతిలో చేసిన పనులను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. వారు చెప్పిన పనులపై సంతృప్తిని వ్యక్తంచేశారు. బడ్జెట్‌పై సర్పంచ్‌లకు అవగాహన ఉండాలన్నారు. శ్మశానవాటిక, డంప్‌యార్డు, ఇంకుడుగుంతలు, ప్యాడి సెంటర్‌ పూర్తిస్థాయిలో ఉండాలని సూచించారు. సమావేశానంతరం గ్రామ పంచాయ తీలో నిద్రించారు. ఆయన వెంట డీపీవో రవీందర్‌, డీపీఆర్వో దశరథం, ఎంపీవో వజీర్‌ అహ్మద్‌, ఎంపీడీవో చిరంజీవి, తాసిల్దారు శ్రీకాంత్‌, సర్పంచ్‌ అమృత, ఎంపీటీసీ ఉప్పుల మల్లేశం, అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ కళావతి, గుళ్లపల్లి నర్సింహరెడ్డి, గుం డారపు కృష్ణారెడ్డి, పిల్లికిషన్‌, ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు. 


logo